ఈదర ఫౌండేషన్ (Eadara Foundation) వ్యవస్థాపకలు మోహన్ ఈదర, కల్పన ఈదర కుటుంబం మరోసారి తమ సేవాదృక్పథాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూర్ జిల్లా, గుడిపాల మండలం, నరహరిపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Government High School) విద్యార్థినీ విద్యార్థులకు చదువురీత్యా కావాల్సిన పలు సౌకర్యాలను స్వయంగా ఏర్పాటుచేశారు.
అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta, Georgia) నగరానికి చెందిన ప్రముఖ మోహన్ ఈదర, కల్పన ఈదర కుటుంబం గత నెల ఇండియా ట్రిప్ లో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ (Science Laboratory) కోసం మైక్రోస్కోప్ పరికరాలు, కంప్యూటర్, పుస్తకాలు, ఆటల సామాగ్రి తమ చేతులమీదుగా అందించారు.
అలాగే పాఠశాలలో మంచినీటి సౌకర్యార్ధం బోరు వేయించారు. అన్ని తరగతి గదులకు రంగులు వేయిస్తామని, మంచి ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు (Students) పైచదువులు కోసం సహాయం చేస్తామన్నారు. అదే స్కూల్లో చదువుకున్న మోహన్ ఈదర (Mohan Eadara) గుర్తుపెట్టుకొని మరీ విద్యాభివృద్ధికి సహాయం చేయడాన్ని ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (Teachers) మోహన్ ఈదర, కల్పన ఈదర (Kalpana Eadara) కుటుంబ సభ్యులను శాలువా, దండలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. వారి పాప, బాబు లను సైతం ఈ దాతృత్వ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి సేవాతత్పరతను పెంపొందించడం అభినందనీయం.
ఈ కార్యక్రమంలో స్థానిక చిత్తూరు శాసనసభ్యులు (MLA) గురజాల జగన్మోహన్, మాజీ శాసనసభ్యులు ఆర్. గాంధీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (Sri Venkateswara University) రిజిస్ట్రార్ భూపతినాయుడు, బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు జక్కా శ్రీనివాసులు, ఎంఇఓలు గణపతి, రాంనాయక్, ఎంపిడిఓ ఉపేంద్ర మరియు పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.