Connect with us

Music

Boston: చక్కని అనుభూతి అందించిన Singers మనో & సత్య యామిని @ TAGB దసరా దీపావళి వేడుకలు

Published

on

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం (Telugu Association of Greater Boston – TAGB) దసరా దీపావళి వేడుకలు అక్టోబర్ 13న బెల్లింగ్ హం హైస్కూల్లో (Bellingham High School) అంగరంగ వైభవంగా జరిగాయి. పూల ద్వారం ఆహుతులకి ఆహ్వానం పలుకగా, ఎన్నో అంగడులు, పిల్లల సందళ్ళతో కార్యక్రమం ఒంటిగంటకి మొదలయ్యింది.

నిరాఘాటంగా నృత్యాలు, పాటలు, వాద్య ప్రదర్శన, నాటక ప్రదర్శన, ఫ్యాషన్ షో (Fashion Show) తదితర వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో అందరిని అలరించి బతుకమ్మ (Bathukamma) వేడుకలతో దసరా (Dussehra) పండుగని బోస్టన్ (Boston, Massachusetts) ముంగిట్లో సరదాగా జరుపుకున్నారు.

గాయకుడు మనో (Nagoor Saheb) మరియు గాయని సత్య యామిని (Satya Yamini) “ప్రియా ప్రియతమా రాగాలు” సంగీత విభావరి Boston శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది అంటే అతిశయోక్తి కాదు. చక్కని మెలోడీలు, ఆపాత మధురాలు, పెప్పీ పాటలు నవరసాలు మేళవించిన పాటలే కాక చక్కని పద్యాలతో ఆనాటి కార్యక్రమం అందరికి ఒక చక్కని జ్ఙాపకంలా నిలిచిపోతుంది.

ప్రెసిడెంట్ శ్రీమతి దీప్తీ గోరా (Deepthi Gora) సారధ్యంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ గొంది (Srinivas Gondi), కార్యదర్శి శ్రీకాంత్ గొమట్టం, కొశాధికారి దీప్తి కొరిపల్లి, కల్చరల్ సెక్రటరి జగదీష్ చిన్నం, బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్ (Board of Trustees) మరియు వాలంటీర్ల సహకారంతో ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రెసిడెంట్ శ్రీమతి దీప్తీ గోరా ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్లగా శ్4 మీడియా మరియు క్లాసిక్ ఈవెంట్ లకు ధన్యవాదాలు తెలిపారు. గాయకుడు మనో (Playback Singer Mano) గారు మొదటిసారి బొస్టన్ (Boston, Massachusetts) రావడం మరియు ఎల్.ఈ.డి స్క్రీన్ మన టీ.ఏ.జీ.బి (TAGB) లో మొదటిసారిగా వాడడం ముదావహం అన్నారు.

ఈ ఆలోచనలు అన్ని కార్యరూపం దాల్చడనికి అహర్నిశలు సహకరించిన అందరికి ప్రత్యేకంగా కొశాధికారి దీప్తి కొరిపల్లి ధన్యవాదాలు తెల్పారు. నలభై యేళ్ళ TAGB (Telugu Association of Greater Boston) ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న మన తెలుగు సంఘం TAGB మరెన్నో పుట్టిన రోజులు ఇలాగే మన తరంతో – మన భావితరాలతో కూడా జరుపుకొవాలని కోరారు.

కొత్త కొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకొని రావడనికి అందరు సహకరించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), క్రీడలు, భాషా వేదికలు, ఇష్టాగోష్టులు, పాటల పోటీ, వేసవి స్నేహోత్సవం, పాటా మాటా ఓ తెలుగాట; కార్యక్రమం ఎదైనా మీ అందరు పాల్గొనడం దానిని విజయవంతం చేయడమే మాకు ఉత్సాహాన్ని, ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యాలి అన్న ప్రేరణని కలుగజేస్తుంది అని అన్నారు.

వేదిక ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో, సంప్రదాయం-అధునికత: పూల ద్వారం -ఎల్.ఈ.డి స్క్రీన్ డిస్ప్లే లతో మేళవించి చేసిన అలంకరణలు చాల చక్కగా వున్నాయని ఆహుతులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ ఏర్పా టు క్లాసిక్ ఈవెంట్ (Classic Event) వారు చేసారు. ఆ నాటి సాయంత్రం అందరికి ఒక చక్కని అనుభూతిగా మిగిని పోతుంది.

error: NRI2NRI.COM copyright content is protected