Connect with us

Cultural

Canada, Toronto: కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో Durham Telugu Club ఫ్యామిలీ ఫెస్ట్ విజయవంతం

Published

on

కెనడాలోని డర్‌హమ్ తెలుగు క్లబ్ (Durham Telugu Club – DTC) ఆధ్వర్యంలో, కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో “డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025:” వేడుకలు టొరంటో (Toronto)లోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియం (Oshawa Auditorium) లో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి సుమారు 800కి పైగా తెలుగు కుటుంబాలు (Telugu Families) హాజరై ఉత్సాహంగా పాల్గొన్నాయి. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల సంతోష్ కుంద్రు, అలాగే యువ వ్యాఖ్యాతలు (Young Anchors) గా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు.

డి.టి.సి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు (Executive Committe Members) నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ‌కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి గార్ల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది.

తరువాత కెనడా జాతీయ గీతం మరియు మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో (Cultural Programms) అన్ని వయసుల పిల్లలు, కళాకారులు అద్భుతమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు (Musical Performances), సంప్రదాయ కళారూపాలతో (Traditional Art Forms) ప్రేక్షకులను అలరించారు.

ఈ వేడుకలో డి.టి.సి కుకింగ్ షో (Cooking Show) మరియు డి.టి.సి కిడ్స్ ఫ్యాషన్ షో (Kids Fashion Show) ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. విజేతలు మరియు పాల్గొన్న వారికి Advanced Physio వారి బహుమతులు గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి అందజేశారు. డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.

కెనడాలో నివసిస్తున్న తెలుగు సమాజం (Telugu Society) చూపుతున్న ఐక్యత (Unity), సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మన భారత సాహితి, సంపద ఉత్సవాలను కెనడా లో ఘనంగా జరపడం మన అదృష్టంగా భావిస్తున్నానని డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు గుర్తు చేసారు

ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా డా. బాబీ యానగావా గారు (ఎం.డి, పీహెచ్.డి, ఎఫ్.ఆర్.సి.ఎస్.సి), డివిజన్ హెడ్ – కార్డియాక్ సర్జరీ, సెయింట్ మైకేల్ హాస్పిటల్ విచ్చేశారు. ఆయన కార్డియో ఆరోగ్యం (Cardio Health) మరియు కుటుంబ ఆరోగ్యం (Family Health) పై విలువైన సూచనలు అందించి డర్‌హమ్ తెలుగు క్లబ్ (Durham Telugu Club) కుటుంబ సభ్యులకు మరింత ఆరోగ్య సంరక్షణ గురించి అందరికీ ఉపయోగపడే విషయాలను చక్కగా వివరించారు.

ఈ సందర్భంగా డీ.టి.సి ఎక్సలెన్సీ అవార్డులు (Excellency Awards) అందజేయబడ్డాయి. డా. బాబీ, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల గారి చేతుల మీదుగా డి.టి.సి కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు – శ్రీమతి ఉషా నడుఱి గారికి, డి.టి.సి ఆర్ట్స్ మ్యూజిక్ & క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి సిరి వంశిక చిలువేరు కి, డి.టి.సి ఆర్ట్స్ & సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాలకి, అందజేసారు.

ముగ్గురు అవార్డు గ్రహీతలకు DTC తరఫున సత్కారం చేసి, వారి ప్రతిభను అభినందించారు. కార్యక్రమ విజయానికి చేయూతనిచ్చిన ప్రాయోజకులను DTC సంస్థ శాలువాలతో సత్కరించింది. ఈ సందర్భంగా గ్రాండ్ స్పాన్సర్‌ (Grand Sponsor) గా తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్‌గా సింప్లీ సౌత్ రెస్టారెంట్ – ఓషావా (రామ్ & సస్య పెడ్డి) గార్లు సహకరించారు. సిల్వర్ స్పాన్సర్స్‌ (Silver Sponsors) గా రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల), రఘు జులూరి, భారత్ లా గార్లు మద్దతు అందించారు.

అలాగే సపోర్టింగ్ స్పాన్సర్స్‌ (Supporting Sponsors) గా అడ్వాన్స్ ఫిజియో (గౌతమ్ పిడపర్తి), డా. శరత్ గుండల, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్ (రాజశేఖర్), సివమ్మ టిఫిన్స్, బండీ మేడ బజ్జి (శ్రవంతి), నమస్తే ఇండియా సూపర్ మార్కెట్ – ఏజాక్స్ (యోగేశ్ జీ), షోబి డెకోర్స్, పవన్ పీ.కె ఫోటోగ్రఫీ (Photography) వంటి ప్రాయోజకులు ఈ కార్యక్రమానికి విలువైన సహకారం అందించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులను డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ సందర్భంలో DTC ప్రెసిడెంట్ శ్రీ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ: “తెలుగు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించే దిశగా, గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని అన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అని పేర్కొన్నారు.

అంతేకాక, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) సమాజ కార్యక్రమాలు, వినూత్న ప్రోగ్రామ్స్, ఎక్సలెన్సీ అవార్డులు, సహకార కార్యక్రమాల విజయానికి ప్రాయోజకులు అందిస్తున్న మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, డర్‌హమ్ తెలుగు అసోసియేషన్ (డీ.టి.ఏ) నుండి శ్రీమతి స్వాతి మీర్యాల గారు, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (Ontario Telugu Foundation) నుండి శ్రీ ప్రవీణ్ నీలా గారు, బర్చ్‌మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (బి.ఎఫ్.సి) నుండి – శ్రీ జగపతి రాయల గారు, శ్రీ సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (టి.టి.సి) నుండి – శ్రీ విజయ కుమార్ కోట గారు, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్ మరియు డర్‌హమ్ హైదరాబాదీ అసోసియేషన్ నుండి వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు తెలుగు సమాజానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.

డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు విందును సింప్లీ సౌత్ – ఒషావా (Simply South-Oshava) సౌజన్యంతో అందించారు. అలాగే, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) వారు 20 కిపైగా బహుమతులతో రాఫెల్ డ్రా (Raffle Draw) విజయవంతంగా నిర్వహించారు.

డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ – ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న భావంతో, తెలుగు సంస్కృతి, ఐక్యత, ఆనందాలతో నిండిన డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం కెనడా టొరంటోలో ఘనంగా విజయం సాధించింది. చివరగా డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు డి.టి.సి కార్యకర్తలు, స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు, వందన సమర్పణలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected