Connect with us

Fashion

లాస్ ఏంజెలెస్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లలో రాణించిన ‘ద్రిష క్లాజెట్’ డిజైనర్ దీప్తి రెడ్డి దొడ్ల

Published

on

ఫ్యాషన్ రంగంలో ఉన్నవారికి అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్ మరియు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఎంత ప్రతిష్టాత్మకమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఫ్యాషన్ షోల్లో పాల్గొనడానికి అటు డిజైనర్లు ఇటు మోడళ్లు లైన్లు కడతారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించి ఫ్యాషన్ ప్రొడక్షన్ కంపెనీల దృష్టిలో పడాలని తహతహలాడుతుంటారు.

ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత ఉన్న ఈ లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్ మరియు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లలో రాణించారు మన తెలుగమ్మాయి, డిజైనర్ దీప్తి రెడ్డి దొడ్ల. ‘ద్రిష క్లాజెట్’ సీఈఓ దీప్తి అమెరికాలో టెన్నెస్సీ లో ఉంటారు. స్థానిక తెలుగు సంఘం అధ్యక్షరాలిగా ఇంతకు మునుపే సేవలందించడం వల్ల అందరికీ సుపరిచితురాలే.

ముందుగా ఈ మధ్యనే ముగిసిన ప్రఖ్యాత న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ద్రిష క్లాజెట్ కి ప్రాతినిధ్యం వహిస్తూ తన డిజైన్స్ ని మెరికల్లాంటి 40 మంది విభిన్నమైన మోడల్స్ తో ప్రజంట్ చేసారు. న్యూయార్క్ లోని గోతం హాల్లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో ద్రిష క్లాజెట్ తో ప్రారంభమవడం గొప్ప విషయం.

రియాలిటీ టీవీ స్టార్స్, ప్రముఖ మోడల్స్ ఈ షో బిగినర్స్ మరియు షో స్టాపర్స్ అవడం వల్ల ద్రిష క్లాజెట్ కి మరింత అందం తెచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. 79 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇదే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో మరో షో మిలియన్స్ లో ఔట్రీచ్ ఉన్న ‘హైటెక్ మోడ’ కూడా అందమైన మోడల్స్ తో ఇంక్లూసివ్ షో గా ముగిసింది.

ఇక గత వారం నిర్వహించిన ప్రత్యేకమైన లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్ లో కూడా డిజైనర్ దీప్తి ‘ది ఫ్యాషన్ లైఫ్ టూర్’ లో ద్రిష క్లాజెట్ ని అన్ని దేశాలకు చెందిన సెలబ్రిటీ మోడల్స్ తో ప్రదర్శించారు. ప్రముఖ నటి మరియు రికార్డింగ్ కళాకారిణి అయిన మిలా నాబొర్స్ ఈ షో కి షో స్టాపర్ అవడం గర్వించదగ్గ విషయం.

ఫ్యాషన్ రంగంలో ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నిలబడడం కష్టమే. మరీ ముఖ్యంగా తెలుగు ఆడపడుచులకు కత్తిమీద సాము లాంటిదే. అయినప్పటికీ వినూత్నమైన కటింగ్ ఎడ్జ్ డిజైన్స్ తో మిగతా ట్రెండీ డిజనర్లకు పోటాపోటీగా రెండు ఫ్యాషన్ వీక్ లలోనూ ప్రదర్శించిన డిజైనర్ దీప్తి, వివిధ దేశాల టాప్ మోడల్స్ ని సమన్వయం చేసుకుంటూ డిజైనర్ గా తన బ్రాండింగ్ ని అభివృద్ధి చేసుకుంటూ ఫ్యాషన్ రంగంలో అద్భుతంగా ముందుకెళుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected