Connect with us

Health

డా. ప్రసాద్ నల్లూరి సాయంతో 550 మంది పేదలకు ఉచిత వైద్య సేవ @ Hyderabad

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో (Hyderabad) అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నాడు తానా ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ (Swecha) సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 550 మందికి పైగా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించారు.

ప్రతి నెలా మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ (Free Medical Camp) రెగ్యులర్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తానా ఫౌండేషన్ ఈ క్యాంప్ నిర్వహణకు సహకరించడం ఇది 8వ సారి. ఈ వైద్యశిబిరానికి డాక్టర్ ప్రసాద్ నల్లూరి (Dr. Prasad Nalluri) కుటుంబం స్పాన్సరుగా వ్యవహరించారు.

తానా ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ (Sasikanth Vallepalli) ఈ క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు. ఈ క్యాంప్ కు గచ్చిబౌలి (Gachibowli), శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న మురికివాడల నుంచి దాదాపు 550 మంది పేదలు హాజరై వైద్య చికిత్సను చేయించుకున్నారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు.

ఈ మెడికల్ క్యాంప్ (Medical Camp) కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంటుందని, వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారని నిర్వాహకులు తెలిపారు. ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు.

విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా (Telugu Association of North America) అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ యెండూరి అభినందించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ప్రసాద్ నల్లూరి (Dr. Prasad Nalluri) కూడా కొంతమందికి వైద్య చికిత్స అందించడం విశేషం.

error: NRI2NRI.COM copyright content is protected