Connect with us

News

Tanzania, Africa: ఆఫ్రికా ప్రజలు పవిత్రంగా భావించే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి

Published

on

Tanzania, Africa: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని (Mount Kilimanjaro) విజయవంతంగా అధిరోహించారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన తానా విశ్వగురుకులం అనే ప్రత్యేక బోధన పద్దతిని ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు వారికి పరిచయం చెయ్యటంలో భాగంగా ఈ సాహస యాత్ర సాగించారు.

తానా విశ్వ గురుకుల (TANA Viswa Gurukulam) బోధనా వ్యాప్తికి, తానా సిద్ధాంతాలు మరియు వ్యవస్థాపక లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో క్లిష్టమైన 7 సమ్మిట్స్ యాత్రకి శ్రీకారం చుట్టారు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి. 7 సమ్మిట్స్ (7 ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలు) అధిరోహించే క్రమం లో భాగంగా ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్ మరియు కిలిమంజారో పర్వతాలను (Mount Kilimanjaro) అధిరోహించారు.

గత మాసంలో యూరోప్ (Europe) ఖండంలోనే ఎత్తైన పర్వతం, రష్యా (Russia) లోని మౌంట్ ఎల్బ్రస్ ( 5642 మీటర్లు/18,510 అడుగులు) అధిరోహించిన సంగతి మీకు తెలిసిన విషయమే. తానా చేసే సేవా కార్యక్రమాలని ప్రోత్సహించడంతో పాటు 2027 లో జరిగే తానా స్వర్ణోత్సవాలని విజయవంతం చెయ్యాలని వాటికీ అందరి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసారు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (Dr. Nagendra Srinivas Kodali).

కిలిమంజారో పర్వతం టాంజానియా (Tanzania) లో ఉంది. ఇది ఆఫ్రికా (Africa) ఖండంలోనే ఎత్తైన పర్వతం (5895 మీటర్లు/19,341 అడుగులు). ఇది మూడు గొప్ప అగ్నిపర్వత శిఖరాలైన కిబో, మావెన్జీ, షిరా కలయికతో ఏర్పడింది. ఆఫ్రికా ప్రజలు దేవతలు సంచరించే ప్రాంతంగా ఈ పర్వతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.

మౌంట్ ఎల్బ్రస్ (Mount Elbrus) రష్యా (Russia) లోని కకాసస్ పర్వతాల్లో ఉంది. ఇది యూరోప్ ఖండంలోనే ఎత్తైన పర్వతం (5642 మీటర్లు/18,510 అడుగులు). ఈస్ట్, వెస్ట్ శిఖరాల కలయికతో దీనిని ద్విశిఖర అగ్నిపర్వతం అని పిలుస్తారు. గతంలో వోల్కానిక్‌ చర్యలు జరిగిన సూచనలు ఉన్నాయి.

error: NRI2NRI.COM copyright content is protected