Oceania, Indonesia: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డు అఫ్ డైరెక్టర్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (Dr. Nagendra Srinivas Kodali) గారు ఇండోనేషియాలోని ఓషేనియాలో ఉన్న ప్రపంచంలో అత్యంత కఠినమైన సమ్మిట్లలో ఒకటైన కార్స్టెన్స్ పిరమిడ్ (Carstensz Pyramid) ను విజయవంతంగా అధిరోహించారు.
పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన TANA విశ్వగురుకులం అనే ప్రత్యేక బోధన పద్దతిని ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు వారికి పరిచయం చెయ్యటంలో భాగంగా ఈ సాహస యాత్ర సాగించారు. తానా విశ్వ గురుకుల బోధనా వ్యాప్తికి మరియు తానా సిద్ధాంతాలు మరియు వ్యవస్థాపక లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో క్లిష్టమైన 7 సమ్మిట్స్ (7 Summits) యాత్రకి శ్రీకారం చుట్టారు.
ఇది ఆయన మూడవ సమ్మిట్. ఈ శిఖరం పూర్తిగా ఎత్తైన రాళ్లతో ఉంటుంది , రాక్ క్లైమ్బింగ్ నైపుణ్యం అవసరం మరియు ఇక్కడ ముఖ్యంగా వాతావరణం అనిశ్చితంగా ఉండటం వల్ల మిగిలిన సెవెన్ సుమ్మిట్స్ (ఏడు ఖండాలలో ఎత్తైన శిఖరాలు) లో కన్నా ఇది అత్యంత క్లిష్టతరమైన పర్వతారోహణ ప్రక్రియగా సాహసకారులు పరిగణిస్తారు.
ఈ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులని శ్రీనివాస్ కొడాలి గారు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా బేస్ క్యాంప్‌లో చిక్కుకుపోయారు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఎంబస్సీ (U.S. Embassy) బృందం సహకారంతో సురక్షితంగా రాగలిగారు. 7 సమ్మిట్స్ (7 ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలు) అధిరోహించే క్రమం లో భాగంగా ఇప్పటికే కార్స్టెన్స్ పిరమిడ్ (Carstensz Pyramid), మౌంట్ ఎల్బ్రస్ మరియు కిలిమంజారో పర్వతాలను అధిరోహించారు.
తానా (Telugu Association of North America – TANA) చేసే సేవా కార్యక్రమాలని ప్రోత్సహించడం తో పాటు 2027 లో జరిగే తానా స్వర్ణోత్సవాలని విజయవంతం చెయ్యాలని, వాటికీ అందరి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసారు.
కిలిమంజారో (Kilimanjaro) పర్వతం టాంజానియాలో ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతం (5895 మీటర్లు/19,341 అడుగులు). ఇది మూడు గొప్ప అగ్నిపర్వత శిఖరాలైన కిబో, మావెన్జీ, షిరా కలయికతో ఏర్పడింది. ఆఫ్రికా ప్రజలు దేవతలు సంచరించే ప్రాంతంగా ఈ పర్వతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు .
మౌంట్ ఎల్బ్రస్ (Mount Elbrus) రష్యాలోని కకాసస్ పర్వతాల్లో ఉంది. ఇది యూరోప్ ఖండంలోనే ఎత్తైన పర్వతం (5642 మీటర్లు/18,510 అడుగులు). ఈస్ట్, వెస్ట్ శిఖరాల కలయికతో దీనిని ద్విశిఖర అగ్నిపర్వతం అని పిలుస్తారు. గతంలో వోల్కానిక్ చర్యలు జరిగిన సూచనలు ఉన్నాయి.
కార్స్టెన్స్ పిరమిడ్ ఇండోనేషియాలోని పాపువా ప్రావిన్స్‌లోని సుడిర్మాన్ (Sudirman) పర్వత శ్రేణిలో ఉంది. దీని ఎత్తు సుమారు 4,884 మీటర్లు (16,024 అడుగులు)ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నప్పటికీ, దాని ఎత్తు కారణంగా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐలాండ్ సమ్మిట్ గా గుర్తించబడింది.