కరోనా మహమ్మారి ప్రభావం ద్వారా మనం నేర్చుకున్న మొదటి పాఠం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ముఖ్యంగా భారతదేశంలో ఉంటున్న ప్రవాసుల తల్లిదండ్రుల సంరక్షణ అనేది ఒక పెద్ద సందిగ్థత. ముఖ్యంగా ఒంటరితనం, ఆందోళన, భయం మరియు ఆరోగ్యం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ప్రవాసులకి కూడా ఇది ఒక అనిశ్చిత స్థితి.
ఇటువంటి సమయంలో డా. గురవారెడ్డి ఆప్యాయ సూచనలు ఉపయోగపడే విధంగా ఒక ముఖాముఖి కార్యక్రమం ఈ ఆదివారం జనవరి 30 న ఏర్పాటు చేశారు. వీధి అరుగు నార్వే వారి ఆధ్వర్యంలో ఆన్లైన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి రాధిక మంగిపూడి సమన్వయకర్త.