Iowa: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన (Health Awareness) సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా (Dr. Smitha Kurra), డాక్టర్ ప్రసూన మాధవరం (Dr. Prasuna Madhavaram), డాక్టర్ నిధి మదన్ (Dr. Nidhi Madan), డాక్టర్ విజయ్ గోగినేని (Dr. Vijaya Gogineni) వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు.
భారత ఉపఖండంలో మధుమేహం (Diabetes) వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ (Cardiologist) అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
గుండె జబ్బు (Heart Disease) అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు. అయోవా చాప్టర్ (NATS Iowa Chapter) బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ (Pulmonologist) డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియా (Sleep Apnea) పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా (Sleep Apnea) లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా (Dr. Smitha Kurra) నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.
North America Telugu Society (NATS) బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati), నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi), నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ (NATS Iowa Chapter) కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా (NATS Iowa Team) టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్ (Cedar Rapids) లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరికి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ (NATS Helpline) అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని..
అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ (NATS Helpline) సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ (NATS Iowa Chapter) సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టాంపా (Tampa) లో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నాట్స్ అయోవా చాప్టర్ (NATS Iowa Chapter) సలహాదారు జ్యోతి ఆకురాతి (Jyothi Akurathi), ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆహారాన్ని అందించినందుకు పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్, ఈవెంట్‌ను నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు హైవతా లైబ్రరీ (Hiawatha Library) కి ధన్యవాదాలు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర అయోవా జట్టు సభ్యులు జగదీష్ బాబు బొగ్గరపు (Jagadeesh Babu Boggarapu), కృష్ణ ఆకురాతి లు ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో, నాట్స్ అయోవా చాప్టర్ (NATS Iowa Chapter) సభ్యులలో ఒకరైన గిరీష్ కంచర్ల ప్రేక్షకులను నాట్స్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.
ఇంకా ఈ NATS (North America Telugu Society) ఆరోగ్య అవగాహన (Health Awareness) సదస్సు కార్యక్రమానికి ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రేయస్ రామ్ ఇంటూరి, నేహా ఒంటేరు, అభిరామ్ కావుల తదితరులు తమ వంతు సహకారం అందించారు.