ఎన్నారై వాసవి అసోసియేషన్ (NRIVA) 7వ గ్లోబల్ కన్వెన్షన్ మిస్సోరి రాష్ట్రం, సెయింట్ లూయిస్ నగరంలో నిన్న జులై 4 న ఘనంగా ప్రారంభమయిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో భాగంగా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు.
వివిధ రంగాలలో విస్తృత సేవలందిస్తున్న పలువురు వాసవైట్స్ కి NRIVA అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి మరియు కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ కన్వెన్షన్ వేదికగా అవార్డులు (Awards) అందించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను వివరిస్తూ వీడియో ప్రోమోస్ ప్రదర్శించారు.
NRIVA బోస్టన్ చాప్టర్ నుంచి డా.దివాకర్ జంద్యం (Divakar Jandyam) కి సమాజ సేవ (Community Service) విభాగంలో అవార్డు అందజేశారు. డా.దివాకర్ ని సతీసమేతంగా (డా. సునీత జంద్యం) వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించి వారి సేవలను, ముఖ్యంగా కోవిడ్ సమయంలో అందించిన సేవలను కొనియాడారు. అవసరానికి లేట్ నైట్స్ ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేసి సహాయం చేసే మనస్తత్వం అని దివాకర్ దంపతులను NRIVA నాయకులు కొనియాడారు.
సినీ నటి లయ, బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్ చేతుల మీదుగా ఈ అవార్డుని డా.దివాకర్ జంద్యం, డా. సునీత జంద్యం దంపతులకు అందజేశారు. ఈ సమయంలో అందరూ ముద్దుగా డీజే అని పిలుచుకునే డా.దివాకర్ జంద్యం (Divakar Jandyam) డీజే టిల్లు సినిమాలోని పాటకు డాన్స్ వేయడం వీశేషం.