దక్షిణ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘము (TANA) జూన్ 10ననిర్వహించిన ధీమ్ తానా పోటీలు ఉత్సాహంగా సాగాయి. మొట్టమొదటగా జ్యోతి ప్రజ్వలన తో పార్రంభం అయిన పోటీలు క్లాసికల్ శింగింగ్, ఫిల్మీ శింగింగ్, క్లాసికల్ డాన్స్, ఫిల్మీ డాన్స్, బ్యూటీ పేజెంట్ మరియు చిలక గోరింకా పోటీలతో సాయంత్రం వరకు సాగాయి.
ఈ ధీమ్ తానా (DhimTANA) పోటీలు సబ్ జూనియర్స్ , జూనియర్స్ , సీనియర్స్ అండ్ అడల్ట్స్ క్యాటగిరి లలో జరగటం విశేషం. ఇందులో విన్నర్స్, 1st రన్నర్స్ లో గెలిచిన వాళ్ళు ఫిలడెల్ఫియా లో జరిగే 23వ తానా మహాసభలలో July 8th & 9th పాల్గొని ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అని నిర్వాహకులు తెలిపారు.
ఈ ధీమ్ తానా (DhimTANA) పోటీలలో నాలుగు సంవత్సరాల క్రియ కల్యాణ ప్రత్యేక ఆకర్షణ గ నిలవటం గమనార్హం. తానా రీజినల్ కోఆర్డినేటర్ (Southern California) ప్రతాప్ చెరుకూరి మాట్లాడుతో ఈ పోటీలు పిల్లలలో ఆత్మవిశ్వసాన్ని పెంచుతాయి అని అన్నారు.
హేమకుమార్ గొట్టి (తానా టీం స్క్వైర్ చైర్ దక్షిణ కాలిఫోర్నియా) మాట్లాడుతూ ధీమ్ తానా (DhimTANA) సదరన్ కాలిఫోర్నియా విజేతలు ఫిలడెల్ఫియా (Philadelphia) లో జరిగే ఫైనల్స్ లో కూడా విజేతలుగా నిలుస్తారు అని ఆత్మవిశ్వసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో తానా దక్షిణ కాలిఫోర్నియా ఎక్సిక్యూటివ్ టీం వేణుగోపాల్ జెట్టి, చంద్రశేఖర్ గుత్తికొండ, ప్రతాప్ జొన్నాదుల, ప్రతాప్ మేదరమిట్ట, హరి నేతి, భాస్కర్ రెడ్డి వళ్ళు, రాజేంద్ర సురపురం, నేతాజీ గుర్రం, మొహమ్మద్ రఫీ దూదేకుల, వివేక్ ఇమ్మనేని తదితరులు పాల్గొన్నారు.