Connect with us

Cultural

జయప్రదంగా ధీమ్ తానా సాంస్కృతిక పోటీలు @ Austin, Texas: Sumanth Pusuluri

Published

on

Austin, Texas: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో జరగనున్న 24వ తానా మహాసభలలో భాగంగా నిర్వహించిన ధీమ్ తానా (DhimTANA) 2025 సాంస్కృతిక పోటీలు ఆస్టిన్ నగరంలో TANA ప్రాంతీయ ప్రతినిధి శ్రీ సుమంత్ పుసులూరి (Sumanth Pusuluri) గారి ఆధ్వర్యంలో ఎంతో జయప్రదంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ టెక్సస్ (Central Texas) ప్రాంతం నుండి 400 మందికి పైగా పాల్గొనడంతో ఈవెంట్ విజయవంతంగా నిలిచింది.

ముఖ్యాంశాలు

క్లాసికల్ (Classical), ఫోక్ (Folk), మరియు ఫిల్మీ నృత్య (Filmy Dance) పోటీలు – వివిధ వయస్సుల గ్రూపుల నుండి వచ్చిన బృందాలు ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పాటల పోటీలు (Singing Competitions) – క్లాసికల్ మరియు ఫిల్మీ/ఫోక్ శైలుల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ ఉత్కృష్టమైన ప్రదర్శనలు చేశారు.

బ్యూటీ పేజెంట్ (Beauty Pageant) ఆడిషన్స్ – Miss Teen TANA, Miss TANA మరియు Mrs. TANA టైటిళ్ల కోసం నిర్వహించిన ఎంపిక కార్యక్రమాల్లో అభిజాత్యంతో కూడిన ప్రదర్శనలు జరిగాయి.

విజేతలకు జాతీయ వేదికపై అవకాశం

ఆస్టిన్ (Austin) ప్రిలిమినరీల్లో విజేతలుగా నిలిచిన వారు ఇప్పుడు జూలై 3–5, 2025 న మధ్య మిచిగన్ (Michigan) రాష్ట్రంలోని నోవీ (Novi, Detroit) నగరంలో జరిగే TANA మహాసభల జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారి ప్రతిభను దేశవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం దక్కినందుకు మేము గర్వపడుతున్నాము.

కృతజ్ఞతలు

ఈ విజయవంతమైన కార్యక్రమానికి తమ మద్దతు మరియు సహకారం అందించిన ఆస్టిన్ TANA టీం, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, స్పాన్సర్లు, మరియు ప్రేక్షకులకు సుమంత్ పుసులూరి (Sumanth Pusuluri) TANA Southwest ప్రాంతీయ ప్రతినిధి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

error: NRI2NRI.COM copyright content is protected