Connect with us

Events

దేవినేని ఉమామహేశ్వరరావు అతిథిగా డెలావేర్ లో NTR శతజయంతి ఉత్సవాలు

Published

on

ఆగష్టు 23న Small wonder and First State గా పిలవబడే Delaware లో శ్రీ హరీష్ కోయ మరియు లక్ష్మణ్ పర్వతనేని గారి బృందం Delaware NRI TDP ని కలుపుకుని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలు నిర్వహించటం జరిగింది. అందులో మాజీ మంత్రి తెలుగుదేశం కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది.

ముందుగా శ్రీ సత్యా అట్లూరి గారు స్వాగతోపన్యాసం చేస్తూ తనకి తెలుగుదేశం పార్టీ కి ఆవిర్భావాన్నించీ అనుబంధం ఉందని వివరిస్తూ అన్నగారు విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర చేసిన ర్యాలీ గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత శ్రీ హరీష్ కోయ గారు మాట్లాడుతూ ఉమా గారితో తనకున్న సుదీర్గ అనుబంధాన్ని నెమరువేసుకుంటూ నీటిపారుదల రంగానికి చేసిన ఆయన సేవలని ఆయన సమర్థతనీ కొనియాడారు.

ఈ సందర్భంగా ఉమా గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి జగన్రెడ్డి దుర్మార్గపుపాలనను ఎండగట్టి ఆయన చేసే అరాచక పాలనని కలిసికట్టుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఉరి వేసేదాకా నిదరపోవద్దని పిలుపునిచ్చారు. డెలావేర్ సీనియర్ నాయకుడు, వెంకయ్య నాయుడు గారికి అత్యంత ఆప్తుడైన శ్రీ వెలువోలు శ్యాంబాబు గారు ప్రసంగిస్తూ తెలుగుదేశం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆకాంక్షించారు .

ఆ తరువాత Delaware NRI TDP తరుపున శ్రీ సత్యా పొన్నగంటి గారు మాట్లాడుతూ ఉమా గారు “జల మూల మిదం జగత్“ అనే సూత్రాన్ని త్రికరణ శుద్ధి గా నమ్మి నవ్యంధ్రా లోని పట్టిసీమ పోలవరం కాక మైలవరం నియోజకవర్గానికి సంజీవని అయిన చింతలపూడి లాంటి ఇతర నీటి ప్రోజెక్టుల పట్ల చంద్రబాబుగారి ఆలోచనలను ఎంతగా ముందుకు తీసుకెళ్ళిందీ వివరించారు.

మరో NRI TDP USA సభ్యుడైన శ్రీ సుధాకర్ తురగా గారు మాట్లాడుతూ సంచలనాత్మకంగా బూత్ లెవెల్లో ఓట్లు వెరిఫికేషన్ మొదలెట్టిన మొట్టమొదటి నాయకుడు ఉమాగారు అని ప్రశంసిస్తూ, ఆయన స్ఫూర్తి తో ఇతర తెలుగుదేశం అభ్యర్థులూ, ఇంచార్జ్ లూ మరియూ నాయకులూ ప్రతి నియోజకవర్గం లో ఓట్లు భద్రపరుచుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగన్రెడ్డి దగుల్బాజీ రాజకీయాల్ని తిప్పికొట్టాలని సూచనలిచ్చారు.

శ్రీ శ్రీధర్ ఆలూరు గారు మాట్లాడుతూ మంత్రిగా ఉమాగారి దక్షతని ప్రశంసిస్తూ చంద్రబాబుగారి తర్వాత మంత్రివర్గంలో ఈయనే అంతటి సామర్థ్యం చూపించగలిగారని వివరించారు. కార్యకర్తలు ఇటీవల విజయవంతంగా జరిగిన మహానాడు లాంటి కార్యక్రమాల్ని చూసి అతివిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళవద్దని సూచించారు.

శ్రీ విశ్వనాథ్ కోగంటి గారు సభలో పాల్గొనటమే కాక ఫోటోగ్రఫీ సేవలు కూడా అందించారు. ఇంకా సభకుహాజరైన వారిలో శ్రీ లక్ష్మీకాంతం కోయ గారు, శ్రీ చందు ఆరె గారు మరియూ శ్రీ కిషోర్ కాకులకుంట్ల గారు ఉన్నారు. పెన్సిల్వేనియా NRI TDP USA సభ్యులైన శ్రీ పొట్లూరి రవి గారు, శ్రీ సునీల్‌ కోగంటి గారు కూడా హాజరై తమఅభిమానాన్ని చాటుకున్నారు. చివరిగా శ్రీ లక్ష్మణ్ పర్వతనేని గారు శ్రీ సత్యా అట్లూరి గారు సభని చక్కగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected