Connect with us

News

తానా సభలకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌, అనసూయ ఆగమనం @ Philadelphia

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో సంగీత విభావరిని నిర్వహించేందుకు దేవి శ్రీ ప్రసాద్‌, యాంకర్ అనసూయ (Anchor Anasuya), హేమ చంద్ర, ఇతర సింగర్స్ కొద్దిసేపటి క్రితమే ఫిలడెల్ఫియా విచ్చేశారు.

మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి వీరికి ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. టాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) తానా మహాసభలకు వచ్చేవారికి తనదైన స్టయిల్‌లో సినీ సంగీత హంగామాను పంచనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected