Hyderabad, Telangana: అమెరికా లో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగవైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు (NATS Convention) ఈ సారి నాట్స్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4,5,6 తేదీల్లో టాంపా (Tampa, Florida) వేదికగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి ప్రముఖ సంగీత దర్శకులు తమన్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ (Gandham Devi Sri Prasad – DSP) కూడా రావడం సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఒక రోజు తమన్ (Ghantasala Sai Srinivas Sivakumar), మరో రోజు దేవిశ్రీ తమ మ్యూజిక్ షోలతో తెలుగువారిని అలరించనున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసే అతిధులతో నాట్స్ హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన సెలబ్రీటీ మీట్ అండ్ (Celebrity Meet & Greet) గ్రీట్‌లో తమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేవీశ్రీతో పాటు తాను కూడా అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొంటున్నానని తమన్ తెలిపారు.
మేమిద్దరి బ్యాక్ టూ బ్యాక్ షోలతో తెలుగు వారికి అంతులేని ఆనందాలను పంచేందుకు సిద్ధంగా ఉన్నామని తమన్ (SS Thaman)అన్నారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని నాట్స్ సంబరాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) అన్నారు. నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే తరహాలో అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అమెరికాలో ఉండే తెలుగు వారు టాంపా (Tampa, Florida) లో నిర్వహించే సంబరాల్లో పాలుపంచుకోవాలని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) కోరారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) అన్నారు.
సంబరాల్లో తెలుగు ఆట, పాటలతో పాటు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు తెలుగువారిని అలరిస్తాయని నాట్స్ (North America Telugu Society – NATS) ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) తెలిపారు. అమెరికా సంబరాలకు వచ్చే తెలుగువారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది (Srinivas Malladi) పేర్కొన్నారు.