Connect with us

Chess

Peru, South America: పాన్-అమెరికన్ చెస్ యువజన పోటీల్లో ప్రతిష్ఠాత్మక FIDE టైటిల్ గెలుచుకున్న దేవాన్ష్ వెల్లంకి

Published

on

Callao-Lima, Peru: ఉత్తర, మధ్య మరియు దక్షిణ అమెరికాలోని 25+ దేశాలు పాల్గొన్న 35వ పాన్-అమెరికన్ చెస్ యువజన ఉత్సవం (Pan-American Chess Youth Festival) 2025 ఇటీవల కాల్లావ్-లిమా, పెరూలో అత్యంత ఘనంగా ముగిసింది. ఈ పోటీలు జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించబడ్డాయి, ఈ ఖండంలోని ప్రతిభావంతులైన చిన్నారి మేధావులు ఇందులో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన దేవాన్ష్ వెల్లంకి (Devansh Vellanki) ప్రముఖంగా నిలిచాడు. అతను U08 విభాగంలో మూడు విభిన్న ఈవెంట్లలో మూడు మెడల్స్ సాధించి ప్రతిభను చాటుకున్నాడు.

క్లాసికల్ చెస్ – 🥇 స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) బ్లిట్జ్ చెస్ – 🥈 వెండి పతకం (సిల్వర్ మెడల్) రాపిడ్ చెస్ – 🥉 కాంస్య పతకం (బ్రోన్జ్ మెడల్)

ఈ అద్భుతమైన విజయాలతో పాటు దేవాంశ్‌ (Devansh) కు ప్రపంచ చెస్ సమాఖ్య (FIDE) నుండి ప్రతిష్ఠాత్మకమైన “కాండిడేట్ మాస్టర్ (CM)” టైటిల్ కూడా లభించింది. ఇది అంతర్జాతీయంగా ఇచ్చే గౌరవం, చెస్‌ (Chess) లో అద్భుత ప్రదర్శనచేసే యువ క్రీడాకారులకు లభిస్తుంది.

దేవాన్ష్ విజయాల వెనక అతని తల్లిదండ్రులు అరుణ్ కుమార్ వెల్లంకి మరియు హరిని చడలవాడ అమూల్యమైన మద్దతు ఉంది. వారు దేవాన్ష్‌లోని ప్రతిభను గుర్తించి, నిత్యం ప్రోత్సహిస్తూ అతనిని ఈ స్థాయికి చేర్చారు. చెస్ ప్రపంచం ఇప్పుడే దేవాన్ష్ వెల్లంకి (Devansh Vellanki) విజయాన్ని ఘనంగా కొనియాడుతోంది.

చిన్నవయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన గుర్తింపు పొందిన దేవాన్ష్ భవిష్యత్‌లో మరెంతో గొప్ప విజయాలు సాధిస్తాడని అందరూ ఆశిస్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన FIDE వరల్డ్ కప్‌లో దేవాన్ష్ అద్భుతంగా పోటీపడి 5స్థానం సాధించి తన స్థాయిని అంతర్జాతీయంగా మరింత మెరుగుపరిచాడు. ఇది అతని స్థిరమైన ప్రగతికి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

error: NRI2NRI.COM copyright content is protected