Connect with us

Literary

Detroit Telugu Literary Club పాతికేళ్ల పండుగ సెప్టెంబరు 30న మొదలు

Published

on

డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (DTLC) పాతికేళ్ల పండుగ రెండు రోజుల పాటు (సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీలు, శని-ఆది వారాలు) ఫార్మింగ్టన్ (Farmington, Michigan) నగరం లో సెయింట్ తోమా చర్చి ప్రాంగణం లో జరుపుకుంటోంది. ఈ పండుగ కి ప్రవేశం ఉచితం. ఈ పండుగకి ఉత్తర అమెరికా లో అన్ని ప్రాంతాల నుండి రావడానికి చాలా మంది తెలుగు సాహిత్య అభిమానులు నమోదు చేసుకుంటున్నారు.

ఈ పండుగకి జరిగే ప్రారంభ సభలో డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (Detroit Telugu Literary Club) అధ్యక్షులు పిన్నమనేని శ్రీనివాస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) అధ్యక్షులు శృంగవరపు నిరంజన్ మరియు డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) అధ్యక్షులు దుగ్గిరాల కిరణ్ ప్రసంగిస్తారు. ఈ పండుగకి ముఖ్య ప్రసంగం “అమెరికా లో తెలుగు భాష – భవిష్యత్తు కోరకు ఏమి చెయ్యగలం” మీద కన్నెగంటి రామారావు ప్రసంగిస్తారు.

ఈ పండుగ భాగంగా “ఈమాట” వెబ్ మాగజైన్ వారు కూడా వారి పాతికేళ్ల పండుగ కూడా జరుపుకుంటున్నారు. ఈ రెండు రోజుల పండుగకి ఉత్తర అమెరికాలో తెలుగు భాష కోసం అనుక్షణం తపించి, ప్రవాసం లో తెలుగు భాషను ముందు తరాలకు అందించడానికి కృషి చేసిన మిత్రులు జంపాల చౌదరి, వంగూరి చిట్టెన్ రాజు, ఆరి సీతారామయ్య, కూచిబొట్ల ఆనంద్, కిరణ్ ప్రభ,వేలూరి వేంకటేశ్వర రావు మరియు జెజ్జాల కృష్ణ మోహన్ రావుల కు సత్కారం చెయ్యాలి అనుకుంటున్నారు. వారి ఊసులు మిగిలిన వారితో పంచుకోవాలి అని అనుకుంటున్నారు.

వీరు మాట్లాడిన ప్రసంగాలు అన్నీ డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డిటియల్సి) యూట్యూబ్ ఛానల్ @DetroitTeluguLitarayClub లో కూడా అందుబాటులో ఉంటాయి. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఏ) జరిపిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలుగు పఠన పోటీల విజేతల బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది.సాయంత్రం మనబడి బాలల సాంస్కృతిక కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రముఖ అవధాని మేడసాని మోహన్ “ప్రబంధ కవులపై అన్నమయ్య ప్రభావం” మీద ప్రసంగం చేసున్నారు.

ఈ పండుగలో భాగం గానే ప్రముఖ తెలుగు సాహితి మిత్రులని ఆహ్వానించి రెండు అంశాల మీద చర్చించదలుచుకున్నారు. ఆ అంశాలు 1. ’ప్రవాస జీవితంలో తెలుగు సాహిత్యంతో అనుభవాలు’, 2. ‘కొత్త తరానికి తెలుగు సాహిత్యంతో అనుబంధం పెంపొందించే అవకాశాలు’. ఈ అంశాలపై వారు ఆహ్వానించిన మిత్రులు పంపిన వ్యాసాలతో పాతికేళ్ల పండుగ జ్ఞాపిక సంచిక ప్రచురించి అందరికీ అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ పండుగ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) కార్యవర్గ సహాయ సహకారాలతో జరుగుతుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected