అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర ఉన్న డెట్రాయిట్ తెలుగు సంఘం (Detroit Telugu Association – DTA) సంఘం తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా DTA ఉగాది ఉత్సవాలు కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించింది.
ఏప్రిల్ 29, శనివారము జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 2200 మందికి పైగా హాజరయ్యారు, 300 పైగా ప్రతిభావంతులైన పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు (Cultural Programs) ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని శ్రీమతి సునీత మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ తోడు అవ్వటంతో DTA ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంతో ఆకాశాన్ని అంటాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రచయిత, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన గౌరవనీయులు పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Dr. Yarlagadda Lakshmi Prasad) హాజరై, తెలుగు పైన ఉన్న అపారమైన అనుభవంతో తనయొక్క ప్రసంగం ఇవ్వటం తో కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులకు ఉత్తేజాన్ని చేకూర్చారు.
ఈ కార్యక్రమం వివరాలలోకి వెళ్తే.. అత్యంత ప్రతిభావంతులైన పిల్లలు తమ యొక్క నాట్య, సంగీతంతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమములు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. తదుపరి గాయని సునీత (Tollywood Singer Sunitha Upadrasta) కి గౌరవార్ధం శాలువాతో తెలుగు ఆడపడుచులు సన్మానం చేయబడింది.
అనంతరం గాయని సునీత బృందం 7 నుంచి రాత్రి 12 వరకు పాటలతో డెట్రాయిట్ (Detroit) ప్రేక్షకులను అలరించారు. మన తెలుగు రుచులు జోడించి రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చెయ్యటం జరిగింది. ప్రతి ఒక్కరికి భోజనం అందేటట్లు DTA సంఘము చాలా జాగర్తలు తీసుకోవటంతో, వచ్చిన ప్రేక్షకులు చాల సంతోషం వ్యక్తం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమానికి తానా (Telugu Association of North America) బృందం అంజయ్య చౌదరి లావు, హనుమయ్య బండ్ల, సునీల్ పంత్ర, శ్రీనివాస్ గోగినేని, శ్రీని లావు, రాజా కాసుకుర్తి, ఠాగూర్ మల్లినేని, ఉమా అరమాండ్ల కటికి, జానీ నిమ్మలపూడి, నాగమల్లేశ్వర పంచుమర్తి తదితరులు హాజరయ్యారు.
వీరితోపాటు DTA పూర్వ అధ్యక్షులు నీలిమ మన్నే, జోగేశ్వరరావు పెద్దిబోయిన, కోనేరు శ్రీనివాస్, వెంకట్ ఎక్క, రమణ ముద్దెగంటి, సుధీర్ బచ్చు, ద్వారకా ప్రసాద్ బొప్పన, సత్యం నేరుసు, సంతోష్ ఆత్మకూరి పాల్గొన్నారు. సభా వ్యాఖ్యాతగా ఉదయ్ చాపలమడుగు వ్యవహరించటం జరిగింది.
అంతేకాకుండా ప్రతీది సజావుగా జరిగేలా తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేసిన ఈవెంట్ కోఆర్డినేటర్లు మరియు వాలంటీర్ అయిన కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, సుబ్రత గడ్డం, అర్చన చావళ్ల, ప్రణీత్ నాని, తేజ్ కైలాష్ అంగిరేకుల, దీప్తి చిత్రపు, స్వప్న ఎల్లెందుల, శృతి బుసరి, రాజా తొట్టెంపూడి, సంజు పెద్ది వారికీ DTA హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది.
ఈ సందర్బంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఇది ఒక మినీ కన్వెన్షన్ ను తలపించేలా జరిగింది అంటూ డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షులు కిరణ్ దుగ్గిరాల (Kiran Duggirala) ను మరియు DTA (Detroit Telugu Association) కార్యవర్గ సభ్యులను ప్రశంసించటం జరిగింది.