డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (Detroit Telugu Association – DTA) ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన కాంటన్ హిందూ టెంపుల్ (The Hindu Temple of Canton) లో జరిగిన దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 700 మందికిపైగా అతిధులు, ఆహ్వానితులు ఈ వేడుకలకు తరలివచ్చారు.
మన ఉజ్వల సంస్కృతి మరియు ఐక్యతను ప్రతిబింబించేలా ఈ దీపావళి (Diwali) వేడుకలు సాగాయని డిటిఎ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల (Kiran Duggirala) తెలిపారు ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 250కి పైగా పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
సాయంత్రం, టాలీవుడ్ సింగర్స్ రఘు కుంచే (Raghu Kunche) మరియు అంజనా సౌమ్య (Anjana Sowmya) లైవ్ మ్యూజిక్ ప్రదర్శనతో వచ్చినవారంతా పరవశించిపోయారు. చక్రవాకం ఫేమ్ ఇంద్ర నీల్ (TV Artist Indraneel) ప్రత్యేక ప్రైమ్ టైమ్ షో కూడా అందరిలోనూ ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది.
30 ఏళ్లకు పైగా డిటిఎ (DTA) లో కీలకంగా ఉన్న వెంకట్ ఏక్క (Venkat Aekka) గారికి ప్రతిష్టాత్మకమైన వడ్లమూడి వెంకట రత్నం అవార్డును ప్రదానం చేశారు. సన్నీ రెడ్డి (Sunny Reddy) గారికి డిటిఎ కమ్యూనిటీ లీడర్ షిప్ అవార్డును, జ్ఞానేశ్వర గుబ్బల గారికి డిటిఎ అవుట్స్టాండిరగ్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డును కూడా ప్రదానం చేశారు.
ఈ DTA దీపావళి వేడుకలకు మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ కాట్రగడ్డ మిల్లర్ (Lieutenant Governor of Maryland Aruna Miller) హాజరై, ప్రవాసులు భవిష్యత్ నిర్మాణంలో ఎలా కీలకంగా వ్యవహరించగలరో వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
డిటిఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సుబ్రతా గడ్డం, రాజా తొట్టెంపూడి, కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, అర్చన చవళ్ల, మంజీరా పాలడుగు, ప్రణీత్ వెళ్లొరె, స్వప్న ఎల్లెందుల, తేజ్ కైలాష్, సంజీవ్ పెడ్డి తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
సలహా కమిటీ సభ్యులు జో పెద్దిబోయిన, నీలిమా మన్నె, సుధీర్ బాచు మార్గదర్శకత్వం చేయడంతోపాటు, మద్దతు అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలను డిటిఎ (Detroit Telugu Association – DTA) ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల తెలియజేశారు.
అలాగే తానా (Telugu Association of North America – TANA) నాయకులు సునీల్ పంత్రా, ఉదయ్ కుమార్ చాపలమడుగు, శ్రీనివాస గోగినేని తదితర నాయకులు మరియు ఎస్వి బోర్డు (Sri Venkateswara Temple) ఛైర్మన్ శ్రీనివాస్ కొనేరు, ఇతర విశిష్ట అతిథులు వేడుకల్లో పాల్గొని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.