Connect with us

News

దశాబ్దానికి పైగా తెలుగు వారికి తలలో నాలుకలా Sunil Pantra @ Detroit, Michigan

Published

on

మిచిగన్ లోని డెట్రాయిట్ (Detroit) లో తెలుగువారికి తలలో నాలుకలా ఉంటూ సేవా కార్యక్రమాలతో దూసుకెళుతున్నారు సునీల్ పాంట్ర. 2007 లో ఉద్యోగ నిమిత్తం డెట్రాయిట్ వచ్చినప్పటి నుండి స్థానిక డెట్రాయిట్ తెలుగు సంఘం (Detroit Telugu Association) మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో వాలంటీర్ గా సేవలు ప్రారంభించారు.

చిత్తూరు (Chittoor) జిల్లా, ఐరాల మండలం, నాంపల్లి గ్రామానికి చెందిన సునీల్ పాంట్ర (Sunil Pantra) పాఠశాల విద్య చిత్తూరు లో, ఇంటర్మీడియట్ నెల్లూరు రత్నం రెసిడెన్షియల్ కళాశాలలో, ఇంజనీరింగ్ తిరువన్నామలై ఎస్ కే పీ లో పూర్తిచేస్తున్న సమయంలోనే రెడ్ క్రాస్, ఎన్ సి సి యువజన సర్వీస్ వంటి నాన్-ప్రాఫిట్ సంస్థల్లో సేవలందించడం అభినందనీయం.

2010-12 లో డెట్రాయిట్ తెలుగు సంఘం (Detroit Telugu Association – DTA) ప్రచురణ విభాగ కార్యదర్శిగా, 2012 లో DTA కార్యదర్శిగా, 2017 లో DTA సంస్థ 40వ వార్షికోత్సవ కార్యదర్శిగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి డెట్రాయిట్ వాసుల మన్ననలు పొందారు. పిన్న వయస్సులోనే వడ్లమూడి వెంకటరత్నం పురస్కారం అందుకోవడం విశేషం.

అనతి కాలంలోనే జాతీయ స్థాయి తెలుగు సంఘం ‘తానా’ లో సేవలందించడానికి నడుం కట్టారు సునీల్ పాంట్ర. 2009 లో తానా వాలంటీర్ గా ప్రారంభించి, 2011 నుండి ప్రస్తుతం 2023 వరకు కూడా డెట్రాయిట్ లో తానా అభివృద్ధికి తోడ్పడుతూనే ఉన్నారు. తానా ప్రకటనల విభాగ అధ్యక్షునిగా (2011-13) మరియు తానా 19వ మహాసభల మీడియా కమిటీ అధ్యక్షునిగా (2014-15) పనిచేశారు.

అలాగే మీడియా విభాగ అధ్యక్షునిగా (2015-17), ఉత్తర ప్రాంత ప్రతినిధిగా (2017-19), సాంస్కృతిక కార్యదర్శిగా (2019-21) మరియు చైతన్య స్రవంతి సమన్వయకర్తగా (2021-23) ఎడతెరిపి లేకుండా డెట్రాయిట్ లో తానా జెండా ని రెపరెపలాడిస్తున్నారు. ఇండియాలో గత చైతన్య స్రవంతి లో దాదాపు 100 కార్యక్రమాలు నిర్వహించి తన నాయకత్వ పటిమను చాటారు.

తానా బ్యాక్ ప్యాక్ ప్రోగ్రాం ద్వారా డెట్రాయిట్ (Detroit) ప్రాంత పాఠశాలల్లోని పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు వంటి స్కూల్ సప్లైస్ అందించడం, అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా సీపీఆర్ (CPR) ట్రైనింగ్, రక్తదాన శిబిరాల నిర్వహణ, 5కే రన్ వంటి కార్యక్రమాల ద్వారా అమెరికాలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

వ్యక్తిగతంగా మృదుస్వభావి అయిన సునీల్ పాంట్ర ఇటు అమెరికాలోనే కాకుండా అటు ఇండియాలో కూడా తన పరిధి మేరకు సామాజిక కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్నారు. తను పుట్టి పెరిగిన ప్రాంతంలోని పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ (Digital Classes) ఏర్పాటుచేసి విద్యార్థులు నూతన సాంకేతికతను ఉపయోగించుకునేలా చేశారు.

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు (Scholarships) అందించడం, గ్రంథాలయాల (Libraries) ఏర్పాటు, విద్యార్థినీవిద్యార్థులకు సైకిళ్ళ పంపణీ, క్యూరీ లెర్నింగ్ పోటీల నిర్వహణ, మహిళలకు కుట్టు మిషన్ల పంపణీ, రైతులకు వ్యవసాయ రక్షణ పరికరాల అందజేత, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందించడం మచ్చుకు ఉదాహరణలు మాత్రమే.

చిత్తూరు ఎన్నారై (Chittoor NRI) సంస్థ ఏర్పాటు మరియు కార్యకలాపాల్లో సునీల్ పాంట్ర క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ జన్మభూమి (AP Janmabhoomi), చిత్తూరు ఎన్నారై సంస్థల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సామజిక సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంటున్నారు.

దశాబ్ద కాలానికి పైగా తెలుగువారికి సేవలందిస్తున్న సునీల్ పాంట్ర (Sunil Pantra) ఇప్పుడు జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఎన్నికలలో సంయుక్త కోశాధికారి (Joint Treasurer) పదవికి పోటీచేస్తున్నారు.

తనను గెలిపిస్తే తానా టీం స్క్వేర్ (TANA TEAM Square) కి లక్ష డాలర్ల విరాళాల సేకరణ చేస్తానని, ఆర్ధిక కార్యకలాపాల్లో సాంకేతికతను జోడించి పారదర్శకత (Transparency) మరియు జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తానంటున్నారు. కాబట్టి తనతోపాటు తన టీం కొడాలి (Team Kodali) ప్యానెల్లోని ప్రతి ఒక్కరికి ఓటు వేసి గెలిపంచవలసిందిగా అభ్యర్థిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected