జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డీసీ లో జరగనున్న 17వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్‌లో భాగంగా ఆటా కన్వెన్షన్ బృందం జూన్ 3-5 తేదీలలో న్యూజెర్సీ, డెలావేర్ మరియు మిచిగన్ రాష్ట్రాలలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది.
కూచిపూడి, భరత నాట్యం, జానపదం మరియు ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో గెలిచిన రాష్ట్ర స్థాయి విజేతలు, డీసీ లో జరగనున్న కన్వెన్షన్‌లో ఫైనల్స్‌లో పోటీపడతారు. ఫైనల్స్‌కు శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం.
శుక్రవారం జూన్ 3న డెట్రాయిట్, మిచిగన్ లో ఎంతో ఆకర్షణీయoగా జరిగిన ఈ డ్యాన్స్ పోటీలలో 30కి పైగా డ్యాన్స్ గ్రూపులు పోటీపడ్డాయి. ఈ కార్యక్రమానికి 200 మంది హాజరు కావడం విశేషం. సయ్యంది పాదం కోఆర్డినేటర్ స్వప్న రెడ్డి కాల్వ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో ప్రతి విభాగంలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు మరియు మొమెంటోలను అందజేశారు.
డెట్రాయిట్ విజేతల వివరాలు:-
జూనియర్స్ సోలో నాన్ క్లాసికల్ – సహస్ర తుపాకుల
సీనియర్ సోలో నాన్ క్లాసికల్ – లిఖిత సుగ్గల
సీనియర్ క్లాసికల్ – శ్రీఅంశ దుబ్బాక
నాన్ క్లాసికల్ జూనియర్స్ గ్రూప్ – వన్య నాగబండి, ఆన్య జంగా, ఆర్ణ మొయిత్రా
సయ్యంది పదం పోటీల ఛైర్ సుధా కొండపు మరియు సలహాదారు రామకృష్ణారెడ్డి అలా వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్‌లందరికీ ధన్యవాదాలు తెలిపారు. కన్వెన్షన్ 50% డిస్కౌంట్ టికెట్స్ కొరకు https://tinyurl.com/yv3u7xd8 ని అలాగే మరిన్ని వివరాలకు www.ataconference.org ని సంప్రదించండి.