Connect with us

Convention

కిక్కిరిసిన దేవిశ్రీ ప్రసాద్ షో, ఇసుక వేస్తే రాలనంత జనం @ తానా సభలు 2వ రోజు

Published

on

మూడు రోజుల తానా (Telugu Association of North America) 23వ మహాసభలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. మొన్న మొదటిరోజు జులై 7 శుక్రవారం నాడు బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) విజయవంతం అయిన సంగతి తెలిసిందే.

ఇక నిన్న శనివారం రోజున తెలుగు సినీ రాక్ స్టార్ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Concert) అయితే విపరీతమైన జనాలతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం అంటే అతిశయోక్తి కాదేమో.

సుమారు 20 వేల మందికి పైగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజికల్ షో కి హాజరయ్యారు. ఎటు చూసినా జనమే, ఆఖరికి కుర్చీలు ఖాళీ లేక యువత అంతా అన్ని లైన్స్ మధ్యలో, అలాగే స్టేజ్ కి ముందు కింద కూర్చొని మరీ ఆస్వాదించారు.

తానా 23వ మహాసభలు (23rd TANA Conference) రెండవ రోజున వెంకటేశ్వర స్వామి పూజతో ప్రారంభించారు. తానా పరేడ్ అనంతరం, ఇనాగరల్ కార్యక్రమంలో భాగంగా జొన్నవిత్తుల రాసిన పాటకి పిల్లలు నృత్యం చేశారు. అందరికీ ఈ పాట తెగ నచ్చేసింది.

నందమూరి బాలకృష్ణ అన్న ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) ప్రాంగణాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. తర్వాత ఆ తారకరాముని ఫోటో ఎగ్జిబిషన్ (Photo Exhibition) ప్రారంభించి ప్రాంగణం అంతా తిరిగి చివరిగా ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

షాపింగ్ స్టాల్ల్స్ ఉన్న ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) స్టాల్ దగ్గిరకి వెళ్లి, అనంతరం బసవతారకం ఆసుపత్రి (Basavatarakam Indo American Cancer Hospital & Research Institute) దాతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తానా వారు ప్రోపర్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది.

ఎందుకంటే జనమందరూ బాలయ్య (Nandamuri Balakrishna) తో సెల్ఫీల కోసం నెట్టుకుంటుంటే వారి నుంచి రక్షణ కవచంలా నియంత్రించడం కోసం వాలంటీర్స్, బాలయ్య అభిమానులు (Balayya Fans) చాలా కష్టపడాల్సి వచ్చింది.

సమాంతరంగా వివిధ రూమ్స్ లో వివిధ కాలేజీల పూర్వ విద్యార్థుల సమావేశాలు (Alumni Associations), జిల్లాల సమావేశాలు, ధీం-తానా ఫైనల్స్ మొదటి రౌండ్ పోటీలు, ఉమెన్స్ ఫోరం, సాహితీ (Literary) కార్యక్రమాలు, అవధానం వంటి కార్యక్రమాలలో జనం పాల్గొన్నారు.

అలాగే మాట్రిమోనీ, ఆరోగ్య సదస్సులు, ఇమ్మిగ్రేషన్, రాజకీయ ఫోరం, నటీనటులు, రాయకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకటరమణ (Nuthalapati Venkata Ramana) తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు.

సాయంత్రం మెయిన్ స్టేజ్ పై నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గద్దె, ఆస్కార్ (Oscar) అవార్డు గ్రహీత చంద్రబోస్ (Chandrabose), భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, పలు రాజకీయ నాయకులు, స్పాన్సర్స్ ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రాసలతో, యాసలతో తెలుగు భాష గురించి, ఇంటి వంట గురించి చెప్పిన విషయాలు ఆహ్వానితులను ఆలోచింపజేశాయి.

ఈషా ఫౌండేషన్ (Isha Foundation) స్థాపకులు సద్గురు ని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించగా, సుమారు 20 నిముషాలు తను చేసిన యోగ, హ్యాపీ లైఫ్ సంబంధిత ప్రసంగం అందరూ నిశ్శబ్దంగా విన్నారు. అనంతరం తానా కార్యవర్గం, బోర్డు సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి సద్గురు (Jagadish Vasudev) ని సత్కరించారు.

అంతకు ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో (Fashion Show) ఆహ్వానితులను అలరించాయి. అలాగే యాంకర్ సుమ (Suma Kanakala) వ్యాఖ్యానం ఎప్పటిలానే బాగుంది. చివరిగా ప్రముఖ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండున్నర గంటలపాటు అదరగొట్టారు.

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ఇంటరాక్టివ్ గా చాలా చక్కగా అలరించారు. తన కూడా వచ్చిన ట్రూప్ కూడా మంచి డాన్సులతో హోరెత్తించారు. ముఖ్యంగా యువత (Youngsters) DSP అంటూ కేరింతలు కొట్టారు.

రాత్రి 12:30 గంటలకు కూడా హౌస్ ఫుల్ ఉందంటేనే తెలుస్తుంది, అందరూ ఎంతలా ఆస్వాదించారో. వందన సమర్పణతో తానా 23వ మహాసభల (23rd TANA Convention) రెండవ రోజు ఘనంగా ముగిసింది.

అన్ని కన్వెన్షన్స్ మాదిరిగానే భోజనాల దగ్గిర మధ్యాహ్నం కొంచెం గడబిడ అయినప్పటికీ దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్ తో అది కొట్టుకుపోయింది. మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/Day 2 In 23rd TANA Convention in Philadelphia ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected