న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరం (New York) లోని గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ (Vani Singirikonda) ఆధ్వర్యంలో ఘనంగా వైభవోపేతంగా జరిగినవి. దాదాపు 500 లకు పై చిలుకు ఆహ్వానితులు హాజరాయారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేరిని నాట్యం (Dance of Warriors), రాగిన్ బ్యాండ్ మరియు స్థానిక సాంస్కృతిక కళాకారుల నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. నైటా నిర్వాహకుల సమిష్టి కృషి ఫలితంగా కార్యక్రమం చక్కటి ప్రణాళికతో సజావుగా జరిగింది. సెక్రటరీ రవీందర్ కోడెల (Ravinder Kodela) కార్యక్రమాన్ని ప్రారంభిచారు.
యాంకర్ లక్ష్మి (Anchor Lakshmi) గారు చక్కటి వాగ్దాటితో కార్యక్రమాన్ని నడిపించారు. చిన్నారుల గణేశాలాపనతో మరియు స్థానిక కళాకారుల నృత్య ప్రదర్షణతో కార్యక్రమం మొదలవగా పేరిని కళాకారుల నృత్యప్రదర్షణ మొట్ట మొదటిసారిగా అమెరికా గడ్డ పై ప్రత్యక్షంగా ప్రదర్శించడం ఎంతో హర్షదాయకం.
సందీప్ నేత్రుత్వంలో కిరణ్, రోహిత్, ఇంద్రజ మరియు అభినయ బృందం వినాయక గద్యం, రామాయణ గట్టం, జూగాల్బండి, ఆకాశలింగ, సమీకరణం, వాయు లింగ, దేవికైవారం, నరసింహ ఘట్టం, శివకల్యాణనమ్, నవ దుర్గ ఘట్టం ప్రదర్శనతో న్యూయార్క్ (New York) వాసులని మైమరిపించారు.
ఈ సందర్భంగా New York Telangana Telugu Association ప్రెసిడెంట్ వాణి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన, మరుగు పడిపోయిన కాకతీయుల కాలంనాటి ప్రాచీన నృత్యాన్ని సజీవంగా నిలిపి, మొట్టమొదటి సారిగా న్యూయార్క్ నగరంలో ప్రదర్శన జరిపించడం ప్రత్యేకంగా తన ప్రెసిడెన్సీలో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం తరుపున ఎంతో ఆనందాన్ని వ్యక్త పరిచారు.
పేరిని నాట్య ప్రదర్శన టైమ్స్ స్క్వేర్ (New York Times Square) లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరిని నృత్యాన్ని సామాజిక మధ్యమాల ద్వారా తెలియచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాని అని ప్రెసిండెంట్ వాణి గారు తెలియచేసారు. ఈ సందర్బంగా సహకరించిన పెద్దలు పైళ్ళ మల్లా రెడ్డి (Dr. Pailla Malla Reddy) గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నైటా (NYTTA) మహాశివరాత్రి (Maha Shivaratri) మరియు ఉమెన్స్ డే (Women’s Day) సందర్భంగా పేరిని నాట్య ప్రదర్శన తో పాటు స్థానిక యంగ్ కిడ్స్ నృత్య మరియు స్కిట్స్ ప్రదర్శనలు ప్రేక్షకులును ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్బంగా అమితాబ్ బచ్చన్ పోయెట్రీ సాంగ్ తో చేసిన్స్ నృత్య రూపకం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.
ఒక మహిళా అధ్యక్షురాలుగా ఈ ప్రధర్శన తన మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినది అని వాణి గారు వ్యక్తపరిచారు. ప్రతిగా నృత్య రూపకాలని రూపొందించిన నృత్య దర్శకులందరిని జ్ఞాపికలు మరియు శాలువాలని అందిచడం జరిగింది. దీంతో పేరిని నాట్య వైభవం ఖండాంతరాలు ధాటినట్లయింది.