Connect with us

Arts

మరుగున పడుతున్న కళలకు జీవం పోసిన సాంస్కృతిక కళోత్సవాలు: TANA, KL University

Published

on

విజయవాడ కెఎల్ యూనివర్సిటీలో ‘తానా చైతన్య స్రవంతి’ వారి ‘తానా – సాంస్కృతిక కళోత్సవాలు’, ‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ సునీల్‌ పంత్ర మరియు ‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్, ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త రాజా కసుకుర్తి సమన్వయంలో, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారథ్యం లో
వందలాది మంది కళాకారుల నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగాయి.

‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ సునీల్‌ పంత్ర మాట్లాడుతూ డిసెంబరు 2, 2022 వ తేదీ నుంచి జనవరి 7, 2023 వరకు 100 కు పైగా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు భాగాలు గా చేయడానికి తల పెట్టాము అనీ, అవి సేవ లో భాగంగా మెడికల్, హెల్త్, విద్యా, గ్రామీణ సదుపాయాలు, మినరల్ వాటర్ ప్లాంట్స్, రైతు రక్షణ లాంటి కార్యక్రమాలు మరియు తానా కళోత్సవాలు – సంగీత, నృత్య, జానపద, సాంస్కృతిక కళలు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు మరికొన్ని అన్నారు. మాకు KL యూనివర్సిటీ ఆడిటోరియం ఇచ్చిన యాజమాన్యం మరియు పూర్తి సహకారం అందించిన భార్గవ్ గారుకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. KL యూనివర్సిటీ యాజమాన్యం ‘తానా’ చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్లప్పుడు ముందుండి చేయూతను అందిస్తున్న వారి ఉదారతను మేము ఎల్లపుడు మరచిపోము అని అన్నారు.

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ మరియు ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త రాజా కసుకుర్తి మాట్లాడుతూ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి డా. రమేష్ పోతినేని గారికి, వేదికను అలంకరించిన ‘తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ఠ కళాకారులకు స్వాగతం పలికి, కళా ప్రదర్శనలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షిస్తున్న అందరికీ శుభాబినంనదనలు తెలియజేశారు.

ఈరోజు తానా కళోత్సవాలను విజయవాడ పరిసర ప్రాంతాలలోని KL యూనివర్సిటీ లో చేయడానికిగల ప్రధానోద్దేశం ఏమిటంటే, మేము చిన్నతనంలో గ్రామాల్లో చదువుకొనే రోజుల్లో మన పండుగలు, తిరునాళ్ళు లో అనేక కళలు చూసేవాళ్ళం అని, సంక్రాంతికి హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు , బుడ బుక్కలు, దసరా వేషాలతో నాట్యాలు, కోలాటం, చెక్క భజన లాంటి ఎన్నో అద్భుతమైన నాట్య ప్రదర్శనలను జరిగేవని, అవి మనస్సుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించేవని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెటూరు మరియు పట్టణ ప్రాంతాల్లో అవి కను మరుగు అయి పోతున్నాయని , ఇప్పటి తరం పిల్లలు మన పూర్వీకులు మన కందించిన కళలను చూడలేక పోతున్నందుకు బాధగావుందని, మన కళలను పరిరక్షించి, కనుమరుగవుతున్న గ్రామీణ కళలను మన భావితరాలకు అందించే బాధ్యత మన అందరి పై వుందని గుర్తు చేశారు.

కళలు మనో వికాసానికి దోహదపడమే కాక, మానసిక వత్తిడి తగ్గించి, మంచి సామాజిక , స్నేహ బృందాలను పెంపొందించు కోవడానికి ఉపయోగపడతాయని, అందుకే మన యువతకు కళలపై ఆసక్తి పెంపొందించి , కళలలో యువతను భాగస్వాములు చేయాలనే సదుద్దేశంతో ‘తానా’ ద్వారా ఈ కార్యక్రమాలను మీముందుకు తీసుకు వస్తున్నాం, మీ అందరూ కళలను ఆదరించాలని కోరారు. ఈ రోజు 25 కు పైగా కళా బృందాలు, వివిధ కళారూపాలను అత్యంత వైభవంగా ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు! ‘తానా’ విద్యారంగానికి చేయూతను ఇచ్చే మరిన్ని కార్యక్రమాలతో పాటు, గ్రామీణ శ్రేయస్సుకు ఉపయోగకరమైన పనులు మరియు సహాయ సహకారాలను అందించడానికి కృషి చేస్తుంది అని చెప్పారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన రమేష్ హాస్పిటల్స్ అధినేత డా. రమేష్ పోతినేని మాట్లాడుతూ, తనకు KL యూనివర్సిటీ కి మంచి అనుబంధం వుందని, చిన్ననాటి మిత్రులను కొందరిని ఈ కార్యక్రమంలో కలుసుకోవడం చాలా ఆనందంగావుందని అన్నారు. ప్రత్యేకంగా 45 సం నుంచి ‘తానా’ లాంటి స్వచ్ఛంద సంస్థ ప్రవాసంలో తెలుగు వారికి సేవలు అందిస్తూ, మాతృభూమి పై మక్కువతో చక్కటి నిబద్దతతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను కొనియాడారు. తానా సంస్థ వారు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా తన పూర్తి సహాయ సహకారాలను అందించగలనని చెప్పారు.

గతంలో ‘టెలీ మెడిసిన్’ అనే కార్యక్రమం ఈ యూనివర్సిటీ ఆడిటోరియం నుంచే చేయడం జరిగిందని, దానికి మంచి స్పందన లభించిందని గుర్తు చేసుకున్నారు. డా. ఉమ కటికి గారు, మహిళలు పురోగతి కోసం ‘తానా ఉమెన్ ఎంపవర్మెంటు’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. తానా కార్యదర్శి సతీష్ వేమూరి మాట్లాడుతూ ఈ చక్కటి గ్రామీణ , జానపద నృత్య ప్రదర్శనలు మేము ప్రత్యక్షంగా చూడడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అని, ఇటువంటి చక్కటి కళలను మరుగున పడి పోకుండా, బ్రతికించాలనే ఆలోచనకు శ్రీకారం చేపట్టిన సునీల్‌ పంత్ర, అంజయ్య చౌదరి, రాజా కసుకుర్తి మరియు తానా కార్యవర్గం , ఫౌండేషన్ వారికి దన్యవాదాలు తెలియజేశారు.

ప్రతిష్ఠాత్మకమైన డ్యాన్స్ అకాడమీ గా పేరు పొంది , మోడీ జీ ‘నమో సింగపూర్’ పర్యటన ఈవెంట్లో మన్ననలు, ఒబామా భారత పర్యటన లో నృత్య ప్రదర్శన, మాన్యశ్రీ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు అనేక ముఖ్య మంత్రుల సమక్షంలో ఎన్నో ప్రదర్శనలు యిచ్చి, తమ ప్రతిభతో భారత ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి అందరి మన్ననలు పొందిన, తణుకు నుంచి విచ్చేసిన అంబిక డ్యాన్స్ అకాడమి/నృత్యాలయం వారి రింగ్ డ్యాన్స్, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

శ్రీమతి దుర్గా మల్లీశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాల బృందం వారు ఫోక్ ఆర్కెస్ట్రా కళా ప్రదర్శన నవ్య ఆధునిక పరికరాలు వాడకుండా, ప్రత్యేక ఫోక్ పరికరాలతో ఇచ్చిన డప్పులు, కోలాటం, చిడతలు, సన్నాయి, మురళీ గానం వంటి ప్రదర్శనలు కొత్త పుంతలు తొక్కి, ఆదివాసి నృత్య ప్రదర్శనలను తలపించేలా అందరినీ ఆకట్టుకున్నాయి.

అద్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విజయవాడ మరియు KL యూనివర్సిటీ తో తనకు ఒక ప్రత్యేకత అనుబంధం వుంది అని, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేపట్టడానికి సన్నాహాలు చేసిన రాజా కసుకుర్తి, సునీల్ పంత్ర, భార్గవ్ కు కృతజ్ఞతలు తెలియ చేశారు. 46 సం. చరిత్ర గల ‘తానా’సంస్థ మన మాతృగడ్డపై చేపడుతున్న రైతు కోసం, మనవూరు, ఆదరణ, కంటి ఆపరేషన్, క్యాన్సర్ క్యాంపులు, లైబ్రరీలు , విద్యాదానం, స్కాలర్ షిప్, డిజిట్‌ల్ క్లాస్రూమ్స్ వంటి ఎన్నో కార్య క్రమాలను, దాతల సాయంతో కోట్లరూపాయలు వెచ్చించి అధ్భుతమైన సేవా కార్యక్రమాలను మీముందుకు తీసుకు రావడం చాలా ఆనందంగా వుంది అన్నారు.

తానా సేవలకు ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన గవర్నమెంట్ సత్కారాలు, టీమ్ స్కేర్ ద్వారా తెలుగు వారికి, విద్యార్థులకు చేస్తున్న సేవ ఉత్తమమైనదని, యూత్ కోసం తెలుగు నేర్పించడం, కళాశాల ద్వారా ప్రవాసంలో వున్న పిల్లలకు సర్టిఫికేషన్ కోర్సులు , సాహిత్య సేవలు తానా చేస్తున్న కార్య క్రమాల్లో కొన్ని. వున్న వూరిని, కన్నతల్లి ని మరచి పోకూడదని ఎంతో కొంత తిరిగి మన పుట్టి పెరిగిన ఊరికి తిరిగి ఇవ్వాలని, యూత్ ఆదిశగా ఆలోచించి మీవంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపు నిచ్చారు.

Dr JV రావు మాట్లాడుతూ పూర్వం రాజులు కళలను, పోత్సహించేవారు, మన దేవాలయ ల పై కళాత్మక చిత్రాలను చిత్రీకరణ చేశారు. ఇప్పుడు కళారూపాలకు ఆదరణ మరుగు అవుతున్న తరుణంలో వాటిని పరిరక్షించే దిశగా ‘తానా’ వారు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. తానాకు సహకారాన్ని అందించిన, Dr JV రావు, డా. రమేష్, వెంకటరావు గారు తదితరులను తానా అద్యక్షులు, మరియు తానా బృందం వారు ఘనంగా సత్కరించారు.

గుడివాడ మాధవి సిస్టర్స్ నృత్యం, శ్రీదేవి సాంస్కృతిక సంఘం బృందావన కృష్ణుడు పై మహిళల కోలాటం ప్రదర్శన, PB సిద్దార్ద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సు వారి డప్పుల ఫోక్ డ్యాన్స్ ప్రదర్శన, జవాన్ మరియు కిసాన్ ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లు తెలియజేసే నాటికను ప్రదర్శించారు. తానా ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లి చేయూత కార్యక్రమం ద్వారా ‘లీడ్ ద ఫౌండేషన్’ మరియు ఆరమండ్ల అచ్యుతరావు, ఆరమండ్ల లీలాబాయి జ్ఞాపకార్థం 13 మందికి విద్యార్థులకు స్కాలర్ షిప్లను అందజేశారు.

ఫ్యూజన్ విత్ వీణ మరియు గిటార్ పై నాదం అనే కార్యక్రమం వీనులవిందు చేసింది. రాజీవ్ మరియు టీమ్ డప్పుల ప్రదర్శన, దుర్గా మల్లీశ్వర మహిళా కళాశాల విద్యార్థులు 13 కళలలో ఒకటైన, చెక్క భజన కళారూపం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. గంగా జాతర జానపద నృత్యాలు, ప్రతిభ గల బాలికల గ్రూపుతో చెక్క భజనలు నిర్వహణ, తెలుగు గ్రామీణ విశిష్టతను తెలియజేసే అధ్భుతమైన ప్రదర్శనలతో మన కళలకు జీవం పోశారు.

ఈ కార్యక్రమంలో తానా నాయకులు పురుషోత్తం చౌదరి, రఘు ఎదులపల్లి, ఠాగూర్‌ మలినేని, శ్రీనివాస్‌ కూకట్ల, నాగ పంచుమర్తి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, తదితరులు పాల్గొన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మరియు వారి బృందం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులు, కార్య నిర్వాహకులు, కార్యకర్తలు , ముఖ్య అతిథులు అందరినీ గౌరవ ప్రదంగా శాలువ, జ్ఞాపకాలతో సత్కరించారు.

తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్ సునీల్‌ పంత్ర, కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ రాజా కసుకుర్తి ప్రత్యేకంగా KL యూనివర్సిటీ యాజమాన్యం, దాతలు, మీడియా, కార్యకర్తలు , కార్యక్రమాలను వీక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తానా 2023, ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ లో జూలై 7,8,9 వ తేదీల్లో నిర్వహిస్తున్న 23 వ ‘తానా’ సభలకు అందరికీ ఆహ్వానం పలికారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected