అమెరికాలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగువారిని ఒక్కటి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా చికాగో (Chicago) లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) కు చక్కటి స్పందన లభించింది.
చికాగో నాట్స్ (NATS) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 150 మందికి పైగా తెలుగు క్రికెటర్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. నాట్స్ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కి తానా, ఆటా సంస్థలు కూడా తమ మద్దతును, సహకారాన్ని అందించి క్రీడా స్ఫూర్తిని చాటాయి.
ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో అపోలో టీమ్ విజేతగా నిలించింది. రన్నరప్‌గా చికాగో తానా (TANA) టీం వచ్చింది. టోర్నమెంట్‌లో విజేతలకు, అత్యుత్తమ ఆటగాళ్లకు నాట్స్ బహుమతులు ప్రదానం చేసింది. చికాగో నాట్స్ విభాగం నాయకులు శ్రీ హరీశ్ జమ్ముల, వీరా తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక సమన్వయంతో ఈ టోర్నమెంట్ విజయానికి కీలక పాత్ర పోషించారు.
చికాగో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన, శ్రీని అరసడ, రవి శ్రీకాకుళం, ఆర్.కె. బాలినేని, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జ, బిందు వీధులమూడి, రోజా శీలంశెట్టి, భారతి పుట్టా, కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్‌కు తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, మురళీ కోగంటి, సంతోష్ పిండి, మనోహర్ పాములపాటి, సునీల్ ఆకులూరి, సునీల్ అరుమిల్లి, నరేశ్, హరీ నాగ, ఆప్జల్ తదితర వాలంటీర్ల ఈ టోర్నమెంట్ కోసం తమ విలువైన సేవలను అందించారు. వారందరికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
క్రీడా స్ఫూర్తిని చాటేలా చికాగోలో విజయవంతంగా క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహించిన నాట్స్ (North America Telugu Society) చికాగో విభాగాన్ని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు.