Connect with us

News

భారతావనికి రామోజీ రావు సేవలు గర్వనీయం: Condolence Meeting @ Atlanta

Published

on

స్వర్గీయ రామోజీ రావు గారి జ్ఞాపకాలను, తెలుగు (Telugu) వారికి, ఈ భారతావనికి వారు అందించిన సేవలను స్మరిస్తూ, అమెరికా లోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) నగర పరిసర ప్రాంతాలలో ఉన్న NAKS సంస్థ సభ్యులు, అక్కడి తెలుగు భాషాభిమానులు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులు చెరుకూరి రామోజీ రావు (Cherukuri Ramoji Rao) గారి చిత్రపటానికి పూలు సమర్పించి అంజలిఘటించారు. కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు, భాషాభిమానులు రామోజీ రావు గారి పట్టుదలను, దీక్షాదక్షతను కొనియాడారు.

ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీ రావు (Cherukuri Ramoji Rao) గారి లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు. రామోజీ రావు గారి జ్ఞాపకార్ధం ప్రత్యేకమైన జెండాను రూపొందించి కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకు అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected