Connect with us

Competitions

ప్రతిభను వెలికితీసేలా నాట్స్ 13వ బాలల సంబరాలు @ Dallas, Texas

Published

on

డల్లాస్, నవంబర్ 21, 2023: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా తెలుగు చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేలా డల్లాస్‌ (Dallas) లో నిర్వహించిన బాలల సంబరాలకు మంచి స్పందన లభించింది.

నవంబర్ 14 జవహర్ లాల్ నెహ్రు జయంతి (Jawaharlal Nehru) సందర్భంగా ప్రతి ఏటా డల్లాస్‌లో నాట్స్ విభాగం బాలల సంబరాలను ఓ సంప్రదాయంలా నిర్వహిస్తూ వస్తోంది. గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలు చిన్నారుల ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తున్నాయి.

ఈ సారి నాట్స్ స్థానిక సెయింట్ మేరీస్ చర్చ్ ఆవరణలో నిర్వహించిన 13వ నాట్స్ బాలల సంబరాల్లో శాస్త్రీయ నృత్యం, నాన్ క్లాసికల్ నృత్యం, శాస్త్రీయ సంగీతం, నాన్ క్లాసికల్ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, మరియు తెలుగు పదకేళి వంటి వివిధ విభాగాలలో బాలబాలికలకు వివిధ పోటీలను నాట్స్ (NATS) నిర్వహించింది.

దాదాపు పది గంటల పాటు ఎంతో ఆసక్తిగా జరిగిన ఈ పోటీలలో (Competitions) 200 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని, తమలోని అత్యుత్తమ ప్రతిభని ప్రదర్శించారు. ఈ పోటీల్లో ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన బాలబాలికలకు నాట్స్ (NATS) నిర్వాహకులు బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమానికి డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, శ్రీధర్ న్యాలమడుగుల, పార్ధ బొత్స, శ్రీనివాస్ ఉరవకొండ, శ్రీధర్ విన్నమూరి, సురేంద్ర ధూళిపాళ్ల, నాగిరెడ్డి మందల, గౌతమ్ కాసిరెడ్డి, వెంకట్, రాధిక, రవీంద్ర చిట్టూరి, యువ నిర్వాహకులు మనోజ్ఞ, గీతిక, మల్లిక, త్రినాథ్, ధృవ్, సాయి, నిత్య, రేహాన్, నిఖిత, యషిత, వరిశ్, మరియు నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డి వి ప్రసాద్, జ్యోతి వనం, ఇతరులు పూర్తి సహకారాన్ని అందించారు.

ఇంకా ఈ కార్య క్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల పాల్గొని వారికి తోడ్పాటుని అందించారు. ఈ పోటీలకు స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ నిర్వాహకులు పిల్లలకు లక్కీ డ్రా నిర్వహించి కొన్ని బహుమతులను అందచేసారు.

మన తెలుగు పిల్లల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ బాలల సంబరాలు ద్వారా గత 13 సంవత్సరాలుగా వేల మంది చిన్నారులకు, విద్యార్థులకు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కలిగించిందని నాట్స్ (North America Telugu Society) అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు) అన్నారు.

చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలను పెంచే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బాలల సంబరాలను చక్కగా నిర్వహిస్తూ, ఇతర నాట్స్ (NATS) చాఫ్టర్లకు విస్తరించడంలో ప్రత్యేక కృషి చేస్తున్న డల్లాస్ (Dallas) చాప్టర్ సభ్యులందరిని బాపు నూతి అభినందించారు.

బాలల సంబరాలను దిగ్విజయం చేసిన డల్లాస్ నాట్స్ విభాగాన్ని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు స్పానర్లయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి నాట్స్ కృతజ్ఞతలు తెలిపింది.

విజేతల వివరాలకు www.NRI2NRI.com/NATS Kids Competitions 2023 Results ని సందర్శించండి. అలాగే మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/NATS Kids Competitions 2023 Photos ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected