గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ మరియు లైఫ్ సౌత్ కమ్యూనిటీ బ్లడ్ సెంటర్స్ సంయుక్తంగా మే 14, 2022న అమెరికాలోని జార్జియా రాష్ట్రం, సువానీ నగరం ఇన్ఫోస్మార్ట్ సంస్థ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇటువంటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గేట్స్ కు ఇదే మొదటిసారి అయినప్పటికీ సంఘం ఘనంగా స్వాగతించింది.
25 మంది దాతలు తమ రక్తాన్ని మహోన్నతమైన లక్ష్యం కోసం దానం చేశారు. గేట్స్ ప్రెసిడెంట్ సునీల్ గోటూర్ మరియు చైర్మన్ ప్రభాకర్ మడుపతి దాతలందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారి విరాళాన్ని ప్రశంసా కానుకతో గుర్తించారు.
సేకరించిన విరాళాల పట్ల లైఫ్ సౌత్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. అటువంటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం కోసం గేట్స్ నుండి మరింత సహకారాన్ని అభ్యర్థించింది. రక్తం కోసం విపరీతమైన అవసరం ఉందని, సరఫరాలో కొరత ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి గేట్స్ ని అనుమతించిన ఇన్ఫోస్మార్ట్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షులు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కరుణాకర్ ఆసిరెడ్డి గారికి, నిర్వహణ సామగ్రి సమన్వపరిచినందుకు సౌజన్య గారికి మరియు శిబిరంలో వివిధ కార్యకలాపాలలో తన సహకారం అందించినందుకు విష్ణు బైసానిలకు గేట్స్ బృందం ధన్యవాదాలు తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం అవడమే కాకుండా మద్దతు ఇచ్చినందుకు డైరెక్టర్ల బోర్డుకు మరియు కార్యానిర్వహక కమిటీకి గేట్స్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ రక్తదాన శిబిరం యొక్క విజయం గేట్స్ బృందాన్ని భవిష్యత్తులో మరిన్ని శిబిరాలను నిర్వహించడం గురించి ఆలోచించేలా చేసింది.
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యుల సామాజిక, సాంస్కృతిక మరియు విద్యాపరమైన విషయాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తుంది. పేద ప్రజలకు సహాయం చేయడానికి సామాజిక కార్యక్రమాలు మరియు తెలంగాణ యొక్క గొప్ప సంస్కృతిని ప్రోత్సహించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం వారి లక్ష్యం. లైఫ్‌సౌత్ కమ్యూనిటీ బ్లడ్ సెంటర్స్ అనేది లాభాపేక్ష లేని బ్లడ్ బ్యాంక్.