Connect with us

Education

Coffee with Cops @ New Jersey, NATS: తెలుగువారి భద్రతపై పోలీసుల అవగాహన

Published

on

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా న్యూ జెర్సీ (New Jersey) లోని ఎడిసన్ లో కాఫీ విత్ కాప్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి భద్రతకు తీసుకోవలసిన చర్యలను ఈ కార్యక్రమంలో ఎడిసన్ పోలీసులు (Edison Police) వివరించడం జరిగింది.

నాట్స్ (NATS) చేపట్టిన కాఫీ విత్ కార్యక్రమానికి స్థానిక పోలీసులు విచ్చేసి భద్రతాపరమైన సూచనలు సలహాలు చేశారు. దొంగతనాలు, దోపిడీల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి. ఆగంతుకులు చేసే దాడుల నుంచి ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి. ఇంటర్నెట్లో జరిగే మోసాల పట్ల మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఎన్నో అంశాలపై స్థానిక పోలీసులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. పలు అంశాలపై తమకున్న సందేహాలను పోలీసులనడిగి నివృత్తి చేసుకున్నారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టిన నాట్స్ (North America Telugu Society – NATS) నాయకత్వానికి తెలుగు (Telugu) వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీహరి మందాడి, టీపీ రావు, శ్యామ్ నాళం, బిందు ఎలమంచిలి, అడ్వైజరీ బోర్డ్ నుండి గంగాధర్ దేసు, నాట్స్ బోర్డు మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ మీడియా మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ చాఫ్టర్ కో-కోఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ భీమినేని, చంద్రశేఖర్ కొణిదెల, రమేష్ నూతలపాటి, వంశీ కొప్పురావూరి, విష్ణు ఆలూరు, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు.

కాఫీ విత్ కాప్ (Coffee with Cops) కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి భద్రత కోసం ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహించిన న్యూ జెర్సీ నాట్స్ విభాగాన్ని (NATS New Jersey Chapter) నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected