అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ప్లోరిడాలోని టాంపా బే (Tampa Bay) లో కోడ్ ఎ బిట్ వర్క్ షాప్ (Code a bit workshop) పేరిట తెలుగు విద్యార్ధులకు కోడింగ్ పై అవగాహన కల్పించింది. విద్యార్ధులకు టెక్నాలజీపై ఆసక్తి పెంచేలా ఈ వర్క్ షాప్ నడిచింది. విద్యార్ధుల పరిజ్ఞానం, నైపుణ్యాలను అంచనా వేయడానికి కోడింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు.
తెలుగు విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తల్లిదండ్రులు నాట్స్ (NATS) పై ప్రశంసల వర్షం కురిపించారు. భావితరంలో కోడింగ్ నైపుణ్యాలు గురించి అవగాహన నింపేందుకు కోడింగ్ వర్క్‌షాప్‌ను చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్, తక్షణ మాజీ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ / మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో-ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, నాట్స్ కోర్ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టాంపా బే విభాగం (NATS Tampa Bay Chapter) కోడింగ్ వర్క్‌షాప్ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు (Bapu Nuthi) బాపు నూతి టాంపా బే (Tampa Bay, Florida) నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.