ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు క్లీన్ చిట్ లభించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి వేం నరేంద్రరెడ్డిని గెలిపించడానికి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ప్రలోభపెట్టడానికి చంద్రబాబునాయుడు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని అప్పట్లో కేసు నమోదు అయింది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎంపి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. చంద్రబాబునాయుడు పాత్రపై తీవ్ర స్ధాయిలో వాదోపవాదాలు సాగాయి. రేవంత్ రెడ్డితో ఆయనే సొమ్ములు ఇప్పించారని ఆయన ప్రత్యర్ధులు తీవ్రస్ధాయిలో ఆరోపించారు. అయితే అవన్నీ అవాస్తవాలంటూ నేడు ఏసీబీ, ఈడీలు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చాయి. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదని దర్యాప్తు సంస్ధలు పేర్కొన్నాయి. కాగా ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చాడని వైకాపా నాయకులు, కొందరు మేధావులమని చెప్పుకునేవారు ఆయనపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు ఏసీబీ చార్జిషీటు తరువాత ఇలా ఆరోపణలు చేసినవారు ఏమంటారో?