Connect with us

Agriculture

చింతలపూడి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతం సస్యశ్యామలం @ Andhra Pradesh

Published

on

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు కాబడిన చింతలపూడి ఎత్తిపోతల పథకం (Chintalapudi Lift Irrigation Scheme) పూర్తి అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతం సత్యశ్యామలం అవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన రా.. కదలిరా.. సభావేదిక మీద చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రాబోయే తెలుగు దేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో త్వరగా పూర్తి చేసి ఉమ్మడి కృష్ణాజిల్లా మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలి అని సాగునీటి వినియోగదారుల సంఘల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు (Alla Venkata Gopala Krishna Rao) నేతృత్వంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ లు బొర్రా అశోక్ కుమార్ (మైలవరం), దొండపాటి భాస్కరరావు (నందిగామ), జంగా చెంచు రెడ్డి (తిరువూరు) తదితరులు చంద్రబాబుకు పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఇదే విషయమై తిరువూరు నుంచి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ రావు మాట్లాడుతూ.. 2017 లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎంతో దూర దృష్టితో రాష్ట్రం విడిపోయిన తరువాత నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ కు సాగర్ జలాలు పూర్తిగా అందకపోవటంతో దానికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకం (Chintalapudi Lift Irrigation Scheme) ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లా మెట్ట ప్రాంతానికి తీసుకురావడానికి రూ. 4,909 కోట్లు మంజూరు చేయటమే కాకుండా 2019 నాటికి రూ. 3,450 కోట్లు ఖర్చు చేసి సుమారు 70 శాతం పూర్తి చేయటం జరిగిందని అన్నారు.

వైయస్సార్సీపి ప్రభుత్వం (YSRCP Government) అధికారంలోకి వచ్చిన తరువాత కక్షపూరితముగా వ్యవహరించి నాబార్డ్ నిధులు తెస్తాము అని ఉత్తుత్తి కబుర్లు చెబుతూ గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో తూతూ మంత్రంగా కేవలం రూ. 650 కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కు ఖర్చు చేసి సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వలన ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ నిలిచిపోయి ఉమ్మడి కృష్ణాజిల్లా కి లబ్ధి చేకూర్చే ఈ పథకం పూర్తి చేయకపోవడంతో రైతులు లక్షల కోట్లలో పంటలను ఇప్పటికే నష్టపోయారని, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు, మైలవరం, నూజివీడు, గన్నవరం, నందిగామ ఈ ఐదు నియోజకవర్గాలలో 18 మండలాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని మూడవ జోన్ లో ఉన్న 2.36 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అంది ఆయకట్టు స్థిరీకరించబడుతుందని, ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా వేంపాడు మేజర్ మీద పిట్టల వారి గూడెం, కోటపాడు, నర్సాపురం దగ్గర గ్రావిటీ మీద సాగునీరు అందని ప్రాంతాలకు 50 వేల ఎకరాలు సాగయ్యే విధముగా రూ. 690 కోట్ల అంచనాలతో గత తెలుగుదేశం ప్రభుత్వ (Telugu Desam Party) హయాంలో ఎత్తిపోతల పథకం మంజూరు చేయటం జరిగిందని, జగన్ రెడ్డి (YS Jaganmohan Reddy) నిర్లక్ష్యం వలన ఈ పథకం కూడా మూలన పడిందని తదితర విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి 2024లో ఏర్పడబోయే తెలుగుదేశం జనసేన (Janasena) ఉమ్మడి ప్రభుత్వంలో దీనికి ప్రాధాన్యత ఇచ్చి 2024 రబీ నాటికి గోదావరి జలాలు ఈ పథకానికి అందించాలని చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు.

దీనిపై చంద్రబాబు సభా ముఖముగా ఈ పథకం పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం చాలా ఆనందదాయకం గా ఉందని “ఆళ్ళ” తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులంతా రాజకీయ పార్టీలకు అతీతంగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు మద్దతు తెలిపి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి తమ వంతు సహకారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected