Naperville, Chicago: చికాగో ఆంధ్ర సంఘం (CAA) డిసెంబర్ 8, ఆదివారం నాడు తెలుగు వైభవం అనే తెలుగు సాహితీ కార్యక్రమాన్ని నేపర్విల్ (Naperville) మాల్ ఆఫ్ ఇండియా లోని దావత్ (Dawat) బాంక్వెట్ హాల్ నందు వైభవంగా నిర్వహించారు. పెద్దలు మరియు పిల్లల క్యాటగిరీలలో వివిధ తెలుగు వినోదాత్మక పోటీలను – తెలుగు మాటల పోటీలు, చిరు నాటిక, బంధుత్వాల వివరణ, ప్రకృతి-వికృతులు, ఉక్తలేఖనం, వ్యాస రచన, పద్యం/డైలాగు పఠనం వంటివి ఏర్పాటు చేసి ప్రేక్షకులను అలరించారు.
మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన ఈ తెలుగు కార్యక్రమానికి మరియు పోటీలకు అనూహ్యమైన స్పందన రావడం నిర్వాహకులను సంతోష పరచింది. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి (Swetha Kothapalli) మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu) గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి (SriKrishna Matukumalli) గారి సహకారంతో అన్విత పంచాగ్నుల గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా చికాగో తెలుగు భాషాభిమానులు విచ్చేసారు.
CAA సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లకు, మాల్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి మరియు సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు పూల గుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, దీపప్రజ్వలన చేయగా, అన్విత పంచాగ్నుల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతం ‘మా తెలుగు తల్లికి’ ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వేదికను తెలుగు తల్లి మరియు పూల దండలతో తెలుగుతనం ఉట్టిపడేలా తమిశ్ర కొంచాడ అలంకరించారు. ఈ తెలుగు పోటీలకు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, మణి తెల్లాప్రగడ, మాలతి దామరాజు, లక్ష్మీ నాగ్ సూరిభొట్ల, యశోద వేదుల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో విజేతలకు, రన్నర్లకు సంస్థ స్పాన్సర్లు మరియు సంస్థ బోర్డ్ సభ్యులు బహుమతులు అందజేసారు.
Chicago Andhra Association (CAA) సంస్థ బృందం, నానీస్ కెఫే (Naani’s Cafe) నుంచి రురికరమైన, అల్పాహారం మరియు సంఘ బోర్డు సభ్యులు శ్రీస్మిత నండూర తయారు చేసిన వేడి వేడి టీ కార్యక్రమానికి విచ్చేసిన వారికి అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగు భాషా గొప్పతనాన్ని తమ పద్యాలతో లక్ష్మీ దామరాజు గారు, వనజ ఓబి గారు మరియు తమ ప్రసంగంతో పద్మ శ్రీ సీరందాసు రామారావు గారు, గీత రచయిత రాజా పెద్దప్రోలు గారు ప్రత్యేక శోభను చేకూర్చారు.
Chicago Andhra Association (CAA) సంస్థ అధ్యక్షురాలు, సంఘ బోర్డు సభ్యులు వారికి శాలువ కప్పి సత్కరించారు. సంస్థ యొక్క ట్రస్టీలు శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu), సుజాత-పద్మారావు అప్పలనేని, మరియు పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, శ్రీ శైలేష్ మద్ది, ఈ కార్యక్రమంలో పాల్గున్నారు.
ఈ కార్యక్రమానికి చక్కటి ప్రోమో అందించిన లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారికి మరియు కార్యక్రమం విజయానికి తోడ్పడిన శ్రీనివాస్ సుబుద్ధి, శ్రియ కొంచాడ, ప్రియ మతుకుమల్లి, బోస్ కొత్తపల్లి , కిరణ్ వంకాలపాటి గార్లకు అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి మరియు బోర్డు సభ్యులు అన్విత పంచాగ్నుల కృతజ్ఞతలు తెలియజేసారు.
సంఘ బోర్డు సభ్యులు శ్రీనివాస్ పెదమల్లు, శ్రీకృష్ణ మతుకుమల్లి, మురళీ రెడ్డివారి, హేమంత్ తలపనేని, శ్రీస్మిత నండూర, తమిశ్ర కొంచాడ, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, ఈ కార్యక్రమం లో పాల్గొని కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలా తమ సహకారాన్నందించారు.