Connect with us

Events

పల్లెటూరి దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా పల్లె సంబరాలు: Chicago ఆంధ్ర  సంఘం

Published

on

చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) వారి పల్లె సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు (India Republic Day Celebrations) ఫిబ్రవరి 8, 2025 తేదీన హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో (Hindu Temple of Greater Chicago) ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముద్దులొలికే చిన్నారుల ముద్దు ముద్దు నాట్యాలు, అలరించిన ఆడపడుచుల ఆటపాటలు, ముచ్చటైన అలంకరణలు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విందు భోజనం, ఉద్వేగ భరితమైన దేశభక్తి  గీతాలతో చికాగో ఆంధ్ర సంఘం ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా ఆద్యంతం వినోదాత్మకంగా జరిగాయి.

 2025 సంవత్సరానికి సంస్థ (Chicago Andhra Association) అధ్యక్షులైన శ్రీకృష్ణ మతుకుమల్లి,  చైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి 1000 మందికి పైగా ఆహ్వానితులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ కౌన్సిల్ జనరల్ శ్రీ T.D. బూటియా గారు చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) చేస్తున్న కార్యక్రమాలను అభినందించి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా దేశభక్తిని అమెరికాలో విస్తరింప చేయడానికి విశేషంగా కృషి చేస్తున్న చికాగో ఆంధ్ర సంఘం యొక్క సంకల్పాన్ని మెచ్చుకుంటూ చికాగో ఆంధ్ర ఫౌండేషన్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.

హేమంత్ తలపనేని, కిరణ్ వంకాయలపాటి గారి ఆధ్వర్యంలో పద్మారావు అప్పలనేని,   ఒగ్గు నరసింహారెడ్డి, శ్రీయాన్ రెడ్డి శెట్టి, నికిత అతులూరి వచ్చిన అతిధుల సభ్యత్వాలు నమోదు చేసుకుని పల్లె సంబరాల కోసం శైలేష్ మద్ది గారు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన క్యాలెండర్ను హాసిని తెలపనేని, రామకృష్ణ తాడేపల్లి, ఆకాశ్, హారిక, ప్రజ్ఞ మతుకుమల్లి కార్యక్రమం ప్రాంగణంలో ప్రత్యేకంగా తీసిన ఆహ్వానితుల చిత్రపటాలతో కలిపి, జయరామరెడ్డి  నీలపు, ధర్మేంద్ర గాలి అందజేశారు.

 శైలజా సప్ప గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ. పల్లెటూరి దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులను తమ చిన్ననాటి జ్ఞాపకాలను మరొక్కసారి నెమరు వేసుకునేలా చేశాయి. సంస్థ ఉపాధ్యక్షురాలు తమిస్రా కొంచాడ గారి సహకారంతో అకేషన్ బై కృష్ణ – కృష్ణ జాస్తి గారు పల్లె వాతావరణన్ని కళ్ళకు కట్టేలా సభా వేదికను సభా ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు.

అనూష బెత్స ఆధ్వర్యంలోని సాంస్కృతిక విభాగం,  శైలజ సప్ప మరియు శ్రీ స్మిత నండూరి సహకారంతో విలక్షణమైన సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి పల్లె సంబరాలకు వచ్చిన ఆహ్వానితులను రంజింప చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన యశోద, స్వర్ణ నీలపు తమ మాటల గారడితో కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా నడిపించారు.

30 మందికి పైగా కళాకారులతో ఉద్వేగ భరితమైన దేశభక్తి గీతాలతో చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను తన్మయత్నానికి గురిచేసింది. యువతి యువకులు కలిసి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల వస్త్రధారణను ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులలో చేసిన ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ  సాంస్కృతిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ లక్ష్మి నాగ్ సూరిబొట్ల గారి మార్గదర్శకత్వంలో రూపొందించిన “పెళ్లి సందడి” దృశ్యరూపకం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వేలా చేసింది.

మురళి రెడ్డి వారి పర్యవేక్షణలో బావర్చి బిరియాని Bolingbrook వారు ఈ వేడుక కోసం పసందైన విందు భోజనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. రుచికరమైన పదార్థాలను సాంప్రదాయమైన పాత్రలలో తెలుగుదనం ఉట్టిపడేలా భారత జాతీయ పతాకం (India Flag) లోని రంగులతో చేసిన అలంకరణ ఆహ్వానితులను సంభ్రమాచర్యాలకు గురిచేసింది.

సురేష్ ఐనపూడి, నరేష్ చింతమనేని, హేమంత్ తలపనేని, బోసు కొత్తపల్లి, హరి తోట,  ఉమా కటికి, శివ బాల జాట్ల, ఇంకా ఇతర స్వచ్ఛంద సేవకులు రుచికరమైన భోజనాన్ని అతిధులకు కొసరి కొసరి వడ్డించారు. పిజ్జా ట్విస్ట్ (Pizza Twist) వారు ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లల కోసం పిజ్జాలను అందజేశారు. చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) వ్యవస్థాపకులలో ఒకరైన సుజాత అప్పలనేని గారి సారధ్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సాంప్రదాయ పద్ధతిలో నేతి అరిసెలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రియా మతుకుమల్లి, హరిణి మేడ, రత్న కందుల, శృతి కూచంపూడి, మాలతి దామరాజు, సుప్రజా తెలపనేని, రమ్య కొత్తమాసు, కిరణ్మయి రెడ్డివారి, శిరీష వీరపనేని, సాహితీ కొత్త, శ్వేత కొత్తపల్లి, శ్రీదేవి మల్లంపల్లి, అరుణ యాగంటి, ప్రతిభ మేదంపూడి, మాధవిలత అనుమల, స్వాతి కన్నెగండ్ల పాల్గొని అతిధులకు కావలసిన అరిసెలను తయారు చేశారు.

2024 సంవత్సరానికి సంస్థ అధ్యక్షురాలిగా పనిచేసిన శ్వేత కొత్తపల్లి గారు తమ యొక్క అపార సేవా నిరతితో సంస్థ అభ్యున్నతికి పాటుపడిన 2024 పరిపాలక మండలి సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి 2024 – 2025 సంవత్సరాలకు చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ పెదమల్లు గారు, 2025  సంవత్సరానికి అధ్యక్షులైన శ్రీకృష్ణ మతుకుమల్లి గారు, సంస్థ  ట్రస్టీలు సుజాత  – పద్మారావు అప్పలనేని, భార్గవి – ప్రసాద్ నెట్టెం, పవిత్ర – దినకర్ కరుమూరి, రాఘవ – శివ బాల జాట్ల, ఉమా కటికి కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాల తమ సహాయ సహకారాన్ని అందించారు.

సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటైన సేవా నిరతిని ముందుకు తీసుకువెళ్లే సంకల్పంతో స్థాపించిన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (Chicago Andhra Foundation – CAF) చేస్తున్న సేవా కార్యక్రమాలను తాము ముందు ముందు చేపట్టనున్న సేవా కార్యక్రమాల వివరాలను CAF తరపున సునీత రాచపల్లి, అనురాధ గంపాల గారు సవివరముగా దృశ్య రూపములో ప్రదర్శించారు. ఈ సందర్భంగా CAF విరాళాల సేకరణకై నిర్వహించిన రాఫెల్ నందు విజేతలైన వారికి  బహుమతులు అందజేశారు.

చివరగా చికాగో ఆంధ్ర  సంఘం (Chicago Andhra Association) సంస్థ తరపున కార్యదర్శి శ్రీ స్మిత నండూరి గారు ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కజేయకుండా కార్యక్రమానికి విచ్చేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, కళాకారులను తమ కరతాళ ధ్వనులతో ఈలలతో ఉత్సాహపరచిన ఆహ్వానితులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, గత రెండు నెలలుగా పల్లె సంబరాలను విజయవంతంగా నిర్వహించడం కోసం అహర్నిశలు శ్రమించిన సంస్థ ప్రతినిధులకు కార్యవర్గ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, స్పాన్సర్స్ కు, పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసి, జాతీయ గీతాలాపనతో ఈ పల్లెటూరి దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా పల్లె సంబరాలు కార్యక్రమాన్ని ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected