Connect with us

Sports

Delaware: ఎత్తుకు పైఎత్తులతో ప్రతిభని చాటిన యువత @ తానా మిడ్-అట్లాంటిక్ చదరంగం పోటీలు

Published

on

Delaware: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) మిడ్ అట్లాంటిక్ విభాగం కమ్యూనిటీకి దగ్గరయ్యేందుకు వీలుగా ప్రతి నెలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సాంస్కతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, సెమినార్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

తాజాగా మార్చి 15, 2026న డెలావేర్‌ (Delaware) లోని మిడిల్‌టౌన్ ‘బెస్ట్ బ్రెయిన్స్’ వేదికగా మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ (Chess Tournament) 2026ను నిర్వహించింది. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే మంచి ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది యువ చెస్ ఆటగాళ్ళు ఇందులో పాల్గొని తమ సత్తాను ప్రదర్శించారు. ఎత్తులు, పైఎత్తులతో అందరినీ ఆకర్షించారు.

ఈ చదరంగం పోటీల కోసం తానా చేసిన ఏర్పాట్లు కూడా అందరి ప్రశంసలను అందుకుంది. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ పోటీలు జరిగాయి.

యువ చెస్ క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్ ను తమ ప్రతిభను చాటుకునేందుకు చక్కగా ఉపయోగించుకున్నారు. టోర్నమెంట్ డైరెక్టర్ జోషువా ఆండర్సన్, తానా (TANA) చెస్ ఈవెంట్ కోఆర్డినేటర్ నాయుడమ్మ యలవర్తి ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

తానా మిడ్-అట్లాంటిక్ బృంద (TANA Mid-Atlantic Chapter) సభ్యులు సతీష్ తుమ్మల, ఫణి కంతేటి (Phani Kantheti), సత్యనారాయణ పొన్నగంటి, సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, నాయుడమ్మ యలవర్తి, నవీన్ ఘంటా మరియు హిమతేజ మికిలినేని ఈ టోర్నమెంట్ విజయవంతానికి ఎంతో శ్రమించారు.

అలాగే, యువ వాలంటీర్లు తపస్వి ఘంటా, కృతి రెడ్డి నిమ్మ, లాలిత్య రెడ్డి యెరువ, ప్రణవ్ కంతేటి, ఆర్నవ్ కంతేటి మరియు దివిత్ శర్మల సేవలను తానా (TANA) గుర్తించింది. ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ జోషువా ఆండర్సన్‌ను తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) ఘనంగా సన్మానించారు.

అనంతరం క్రీడాకారులకు మరియు వాలంటీర్లకు సర్టిఫికేట్లు (Certificates) అందజేశారు. యువతలో మేధోపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి తానా (TANA) ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పోటీలకు గ్రాండ్ స్పాన్సర్లుగా గ్లెన్‌మూర్ ఫ్యామిలీ డెంటిస్ట్రీ, రాజా గాంధే (ఎక్స్‌పీరియర్ ఫైనాన్షియల్ గ్రూపు ఇంక్ వ్యవహరించారు.

చదరంగం (Chess) పోటీలకు మౌలిక సదుపాయాలను కల్పించిన కిషోర్ కుకలకుంట్ల, శ్రీదేవి నెక్కలపులకు తానా ధన్యవాదాలు తెలియజేసింది. వచ్చిన ఆటగాళ్ళకు, వాలంటీర్లకు రుచికరమైన భోజనం, టీ, కాఫీని ‘నమస్తే ఇండియా’ (గ్రోసరీ స్టోర్ అండ్ రెస్టారెంట్) వారు సమకూర్చారు.

విజేతలు

నాన్ రేటెడ్ కె. 8 విభాగంలో: ధన్విన్ అమిరిశెట్టి, అనయ్ వర్మ, సరాన్ష్ సాగర్

నాన్-రేటెడ్ 9-12 (పెద్దలతో కలిపి): చాణక్య వర్ధన్ కేతిరెడ్డి, లాల్ ఎం, ధ్రుపద్ వెలగపూడి

రేటెడ్ 500 లోపు: హర్షిత్ కన్నన్, రేయాన్ష్ కక్కెర్ల, ప్రతీక్ పరిదా

రేటెడ్ 900 లోపు: సాయి వెంకట్ శాన్విత్ నందన్ అలహరి, లూకాస్ లియు, పూర్వాన్స్ నాయక్

రేటెడ్ ఓపెన్: సాయి రేయాన్ష్ నగిశెట్టి, లోహిత్ శ్రీ కృష్ణ ఎంగళ్ళ, సిధ్ తివారీ

error: NRI2NRI.COM copyright content is protected