Connect with us

News

కువైట్ ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు, ఇఫ్తార్ విందు

Published

on

నవ్యాంధ్ర దార్శనికుడు, అమరావతి సృష్టికర్త, భావితరాల స్ఫూర్తి ప్రదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్ లో ఇప్తార్ విందు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు.

ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సీనియర్ నాయకులు వెంకట్ కోడూరి గారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టి జరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.

ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సీనియర్ నాయకులు సురేష్ బాబు నాయుడు మాలెపాటి గారు మాట్లాడుతు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బందులు తొలగి ప్రజలు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే రాష్ట్రానికి బాబు గారి అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ అంధకారం అవుతుందన్నారు.

ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సీనియర్ నాయకులు ఉదయ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసి ప్రజలపై అనేక రకాల పన్నులు, అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఒక్కరూపాయి సంపద సృష్టి జరగడం లేదన్నారు. ఇటువంటి సైకో, తుగ్లక్ పరిపాలనకు చరమగీతం పాడాలంటే మనమందరం పార్టీ కోసం కష్టపడి పని చేసి చంద్రబాబునాయుడు ను ముఖ్యమంత్రిని చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ గుడే శంకర్ చౌదరి గారు మరియు వారి కార్యవర్గం, ఎన్ఆర్ఐ టిడిపి మైనార్టీ విభాగం అధ్యక్షులు రహమతుల్లా గారి సూచన మేరకు వారి కార్యవర్గం, ఎన్ టి ఆర్ సేవా సమితి అధ్యక్షులు చుండు బాలారెడ్డయ్య నాయుడు గారు మరియు వారి కార్యవర్గం, ఎన్ టి ఆర్ పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు జి. నరసింహులు గారు మరియు వారి కార్యవర్గం, చంద్రన్న సేవా సమితి అధ్యక్షులు షేక్ సుబహాన్ గారు మరియు వారి కార్యవర్గం, తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు నాయనిపతి విజయకుమార్ చౌదరి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు, మరియు సీనియర్ నాయకులు వెంకటేష్ నాయుడు వేగి గారు ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కువైట్ కౌన్సిల్ సభ్యులు ఓలేటి రెడ్డయ్య చౌదరి గారు, షేక్ ఎండీ అర్షద్ గారు కోఆర్డినేట్ చేశారు. ఈ కార్యక్రమానికి పరోక్షంగా సహకరించిన ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ అధ్యక్షులు గుదె నాగార్జున గారికి ధన్యవాదములు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected