Connect with us

Celebrations

షార్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో భారీ ఎత్తున నిర్వహించారు. ఏప్రిల్ 20 న అమెరికా అంతటా తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు సమన్వయపరుచుకొని ఈ వేడుకలు నిర్వహించారు.

పుట్టినరోజు వేడుకలలో భాగంగా అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 19 మంగళవారం సాయంత్రం నార్త్ కెరొలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో కూడా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం చౌదరి గుడే మరియు ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు సమావేశమయ్యారు.

హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం అంటూ అభిమానుల నినాదాల నడుమ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి గుడే మాట్లాడుతూ 72 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పడే తపన, కష్టం మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అలాగే ఆర్ధిక సహాయంతోపాటు అందరూ తమ వంతు ప్రయత్నం చేసి 2024 లో నారా చంద్రబాబు నాయుడు ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి అసలైన పుట్టినరోజు బహుమతి ఇవ్వాలని కోరారు.

అనంతరం దేవరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తే తను మనకు మరియు మన తర్వాత తరాలవారికి మంచి భవిష్యత్తును ఇస్తారని అన్నారు. మనం కూడా అలసత్వం వదిలి మేధోమధనం చేసి తెలుగుదేశం పార్టీ కి మన మన గ్రామాల్లో ఎలా సహాయం చేయగలమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

అందరూ నారా చంద్రబాబు నాయుడు, అన్న నందమూరి తారకరామారావు ఫోటో బ్యాక్ డ్రాప్ లో తెలుగుదేశం పార్టీ జండాలు చేతబట్టి ఉత్సాహంగా ఫోటోలు దిగారు. తదనంతరం వర్కింగ్ డే అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఠాగూర్ మల్లినేని కృతఙ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected