Connect with us

Sports

4 నెలల పాటు సాగిన ఆటా క్రికెట్ టోర్నమెంట్ కి ఘనమైన ముగింపు @ Milwaukee, Wisconsin

Published

on

అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ఆధ్వర్యములో మిల్ వాకీ టీం, మిల్ వాకీ చాంపియన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అంగరంగ వైభవంగా దాదాపు 4 నెలలు పైగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో ఎనిమిదికి పైగా టీంలు పాల్గొన్నాయి

సెప్టెంబర్ 24, 2023 తేదీన నిర్వహించిన ఫైనల్స్ లో విజేతలకు ఆల్డర్ వుమన్ మరీనా దిమ్మెట్రీజెవిక్ ట్రోఫీ ప్రధానం చేసారు. ఈ (Cricket) టోర్నమెంట్ నిర్వహణలో ఆటా (ATA) విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్లు పోలిరెడ్డి గంటా, చంద్ర మౌళి సరస్వతి, స్థానిక కోఆర్డినేటర్ కరుణాకర్ రెడ్డి దాసరి ఉన్నారు.

అలాగే మహిళా సమన్వయకర్తలు సింధు, కావ్య, జీవిత,స్థానిక మీడియా కోఆర్డినేటర్ జయంత్ పారా, లోకల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ రబ్బా, లోకల్ స్టూడెంట్ కోఆర్డినేటర్ ప్రణీత్ పి మరియు టీమ్ సభ్యులు పావని, శ్రావణి, లోహిమ, రోజా, గోపాల్, రాజబాబు మరియు రాజ్ సాహు తమ సహకారం అందించారు.

ఆటా (American Telugu Association) అధ్య క్షురాలు మధు బొమ్మినేని, ఎగ్జిక్యూటివ్ టీం కార్యవర్గ సభ్యులకు మరియు మీడియా సహకారం అందించిన మీడియా టీం మెంబెర్స్ అనిల్ బొద్దిరెడ్డి, భాను స్వర్గం, నిరంజన్ పొద్దుటూరి, శీతల కి ధన్యవాదాలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected