Connect with us

News

NRI TDP Belgium, Europe: బెల్జియంలో ఘనంగా NDA కూటమి విజయోత్సవాలు

Published

on

NRI TDP బెల్జియం (Belgium) ప్రెసిడెంట్ అలవాలపాటి శివకృష్ణ, కోశాధికారి కొండయ్య కావూరి, రీజనల్ సమన్వయకర్త దినేష్ వర్మ కోడూరి, జనసేన నాయకులు ప్రవీణ్ జరుగుమల్లి ఆధ్వర్యంలో కూటమి (National Democratic Alliance – NDA) విజయోత్సవ కార్యక్రమం ఘనంగా చేశారు.

ఈ కార్యక్రమంలో NRI TDP బెల్జియం ప్రెసిడెంట్ శివకృష్ణ మాట్లాడుతూ.. ప్రపచవ్యాప్తంగా ఇది ఒక చారిత్రాత్మక విజయం, ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP), జనసేన పార్టీ (Jana Sena Party – JSP), బీజేపీ (Bharatiya Janata Party – BJP) పార్టీ నాయకులకు, కార్యకర్తలకు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.

ఇది కొన్ని పార్టీలు కలిసి సాధించిన విజయమే కాదు. నా భూమి నాది అని చెప్పుకోలేని పరిస్థితి నుండి, విముక్తి కలగాలి అని ఓటు వేసి గెలిపించిన రైతు ది ఈ విజయం. నా రాష్ట్ర రాజధాని కోసం నా భూమి అని 30,000 ఎకరాలు ఇచ్చిన రైతన్నల కుటుంబాలది ఈ విజయం. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అనే నేను అనే పదం కోసం కదం తొక్కిన ప్రతి కార్యకర్తది ఈ విజయం. జనం కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనే నాయకుడి కోసం కాలు దువ్విన కుర్ర కారులది ఈ విజయం. దేశ భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం అని కౌగిలించిన కమల దళం ది విజయం. ఇది తెలుగు ప్రజల ఘన విజయం అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో NRI TDP బెల్జియం (Belgium), జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా జయప్రదం చేశారు. అనంతరం జూమ్ మీటింగ్ లో భాను ప్రకాష్ మాగులూరి (NRI TDP USA), మన్నవ సుబ్బారావు (టీడీపీ గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్), రాయపాటి అరుణ (జనసేన నాయకురాలు), యష్ బొద్దులూరి ( NRI TDP USA), స్వాతి రెడ్డి (NRI TDP UK), చలసాని కిషోర్ బాబు (NRI TDP Europe) పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected