ఆస్ట్రేలియాలోని న్యూస్ సౌత్ పార్లమెంట్లో ఏఐఎస్ఇసిఎస్ (AISECS) ఆధ్వర్యంలో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ ఈవెంట్ లో కోటి గారి జీవిత సాఫల్య పురస్కారానికి ఐక్యరాజ్యసమితి (UNAA NSW) సభ్యులు సహేరా, పౌలా, సైస్టా ఖాన్, మటియ పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అధ్యంతం చిరునవ్వులు చిందిస్తూ చిరు అడుగులు వేస్తూ ఆస్వాదించారు. కోటి గారిని అడిగి మరీ కొన్ని పాటలు పాడించుకున్నారు. రూప్ తేరా మస్తానా పాటకి కోటి గారి స్వరానికి తమ చెప్పట్లతో పాటు నాట్యాన్ని కూడా జత చేసి హర్షద్వానాలు అందించారు.
సంగీతాన్ని ఆనందించడానికి ఆశాంతం అనుభవించడానికి భాషతో పనిలేదని భావం అర్థం చేసుకోవడానికి అక్షర జ్ఞానం అవసరం లేదని ఇంద్రియ స్పందనే చాలని అందరూ నిరూపించారు.
కార్యక్రమంలో భాగంగా మగువల మనసు లే అనే కొత్త తెలుగు పాట టీజర్ ని కూడా లాంచ్ చేశారు. ఈ పాటను ఆసియా బుక్ రికార్డులో స్థానం సంపాదించిన సింగర్ సుష్మిత రాజేష్ పాడగా తేజాంజలి వలవల అనే నూతన లిరిసిస్ట్ రాశారు.