St. Louis, Missouri: తెలుగుజాతికి దిశానిర్దేశకుడిగా నిలిచిన దార్శనిక నాయకుడు, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి 75వ పుట్టినరోజును పురస్కరించుకుని అమెరికాలోని సెయింట్ లూయిస్ (St. Louis) నగరంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు, అభిమానులు సమిష్టిగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
చంద్రబాబు గారి జన్మదినాన్ని తమ ఇంటి పండుగలా భావించి, దాన్ని ఒకతాటిపైకి తెచ్చినట్లుగా అభిమానం, గౌరవం, ఐక్యతతో పండగ వాతావరణంలో జరిపారు. టీడీపీ (TDP) వేదికను తలపించేలా అలంకరించబడిన హాల్‌లో, నేతపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించేలా నినాదాలు, ప్రసంగాలు కొనసాగాయి.
ఈ వేడుకలో టీడీపీ నాయకులు St. Louis TDP అధ్యక్షుడు కిషోర్ యార్లగడ్డ (Kishore Yarlagadda), NRI TDP ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి చెంచు (Venugopal Reddy Chenchu), TDP సీనియర్ నేత రజినీకాంత్ గంగవరపు (Rajinikanth Gangavarapu), ప్రాంతీయ సమన్వయకర్త రాజ సూరపనేని (Raja Surapaneni) పాల్గొన్నారు.
వీరితో పాటు కిషోర్ యరపోతిన, రవి పోట్ల, విజయ్ బుడ్డి, సురెన్ పాతూరి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే జనసేన (Janasena) తరఫున విజయ్ సాక్షి (Vijay Sakshi), సత్య (Satya) హాజరయ్యారు. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కార్యకర్తల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమం మరింత విశిష్టతను సంతరించుకుంది.
ఈ వేడుకలో నాయకుడిపై (Nara Chandrababu Naidu) ఉన్న అభిమానం ఎంత వాస్తవమో, అందరి హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం ఎంత పదిలమో స్పష్టంగా కనిపించింది. అనేక కార్యక్రమాలు, సంస్కృతిక ప్రదర్శనలు, స్నేహసంభాషణలతో ఈ వేడుక ఓ స్ఫూర్తిదాయక ఘటనగా నిలిచింది.