Connect with us

Picnic

ఆహ్లాదకరంగా క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం వనభోజనాలు

Published

on

క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం ‘కాట్స్’ వారు జూన్ 5న మేరీల్యాండ్ రాష్ట్రం, డమాస్కస్ నగరంలోని రీజినల్ పార్క్ లో వనభోజనాలను ఏర్పాటుచేశారు. కాట్స్ నిర్వహించిన ఈ వనభోజనాలకు ఎపుడు బిజీగా ఉండే జీవితంలో కాస్తంత ఆహ్లదం కోరుకొనేవారు ఎవరు ఉండరు చెప్పండి. DMV ఏరియా లో ఉన్న ప్రవాస భారతీయులు అందరూ కలిసి వనభోజనాలలో పాల్గొన్నారు. కోవిడ్ అనంతరం నిర్వహించిన ఈ మొట్ట మొదటి వనభోజనాలలో సుమారు 1000 మందికి పైగా పాల్గొని చాలా రోజుల తర్వాత ఔట్డోర్ ఈవెంట్ లో మ్యూజిక్ తో ఆహ్లదకరమైన వాతావరణం లో సందడి చేశారు. వివిధ రకాల పసందైన వంటకాలతో పాటు తేనేటి విందులను అతిధులకు వడ్డించారు.

రాఫెల్స్ తీసి గెలిచిన విజేతలకు జూలై లో జరగబోయే ఆటా (ATA) కన్వెన్షన్ టికెట్స్ ని అందజేశారు. వాలీ బాల్, త్రో బాల్, బింగో వంటి సరదా గేములు నిర్వహించారు. మహిళల కోసం మెహందీలను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ఏర్పాటుచేసిన magician ఆహ్లాదకరమైన దుస్తులలో ప్రదర్శన ఇస్తూ, సంగీతాన్ని ప్లే చేస్తూ, లింబో, పారాచూట్, డ్యాన్స్, గారడీ క్యాచ్ & త్రో, ఫన్ స్టిక్స్, రింగ్స్ మరియు హులా హూప్స్ తో గారడీ ప్రదర్శనను ప్రదర్శించాడు.

ప్రెసిడెంట్ సతీష్ వడ్డీ గారి ఆధ్వర్యంలో మేరీల్యాండ్ లో పిక్నిక్ కాట్స్ కి గత మూడు సంవత్సరాల తర్వాత జరుపుతున్న మొదటి ఈవెంట్ ని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాట్స్ వాలంటీర్స్ కీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి స్పందన రావడం తో ఫ్యూచర్ లో చాలా ఈవెంట్స్ మేరీల్యాండ్ లో చేయబోతున్నట్లు తెలియజేసారు. త్వరలో జరుగునున్న ATA Convention కి అందరూ తప్పకుండా రావాలని కోరుతూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దీపికా భుజాల గారికి, సుధీర్ బండారు గారికి మరియు రవి చల్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాట్స్ వ్యవస్థాపకుడు రామ్మోహన్ కొండా గారు మాట్లాడుతూ ఈ పిక్నిక్ ఈవెంట్ లో చాలా మంది కొత్త వ్యక్తులను కలుసుకున్నాం. ఇలా అందరినీ ఒకే దగ్గర కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మన DMV ఏరియా లో తెలుగు వాళ్లకు కాట్స్ ఎప్పుడు అండదండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా కాట్స్ లో భాగస్వాములుగా చేరి మా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున సాగిన ఈ కాట్స్ పిక్నిక్ కు సహాయ సహకారాలు అందించిన కాట్స్ EC టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాన కార్యదర్శి పార్థ బైరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ వంతు సహకారాన్ని అందించిన కాట్స్ కార్యవర్గానికి, Trustees మరియు Advisors కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఈవెంట్ కి విచ్చేసిన రామ్మోహన్ గారికి, భాస్కర్ గారికి, అనిల్ గారికి, రవి గారికి, ప్రవీణ్ గారికి, గోపాల్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా ఈ ఈవెంట్ కోసం మాతో పాటుగా కృషి చేసిన మా కాట్స్ కార్యవర్గం రజని, కోట్ల, పవన్ D, రవి బారెడ్డి, లోహిత్, మహేష్, రంగ, శివ P, శ్రీనివాస్ P, కృష్ణ కిషోర్, రాం పూరం గౌడ్, నివాస్, సాయి అరిగేలా, అరుణ, లావణ్య మరియు సంకీర్త లకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

రామ ఎరుబండి గారు మాట్లాడుతూ విద్యార్థి వాలంటీర్లు కు స్వచ్ఛంద పని గంటలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కౌశిక్ సామ గారు మాట్లాడుతూ గైథర్స్‌బర్గ్‌లోని మన్నా ఫుడ్ సెంటర్‌కు విరాళంగా ఫుడ్ డ్రైవ్ ను నిర్వహిస్తునట్లు తెలిపారు. రమణ మద్దికుంట గారు మాట్లాడుతూ స్పాన్సర్స్ అందరికీ మరియు మా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు .

అలాగే ATA Convention కన్వీనర్ సుధీర్ బండారు మాట్లాడుతూ జూలై 1,2,3 తేదీల్లో జరగబోయే 17వ ATA కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ గురించి తెలుపుతూ అందరికీ ఆహ్వానం పలికారు. కాట్స్ ప్రెసిడెంట్ సతీష్ వడ్డీ గారు భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇదే తీరుగా సహకారం ఇవ్వాలని కోరుతూ, తమ ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రవాస తెలుగు వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected