వర్జీనియాలో క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (CATS) ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. పద్మజా రెడ్డిగారిని మీట్ & గ్రీట్ ఈవెంట్ ద్వారా సత్కరించారు. ఈవెంట్‌కు దాదాపుగా 150 మందికి పైగా హాజరుకావడంతో భారీ విజయాన్ని సాధించింది. వర్జీనియా ఎన్నారై కుటుంబాలు శనివారం జూలై 9వ తేదీన చాంటిల్లీ, వర్జీనియాలోని స్థానిక అతిధి రెస్టారెంట్ వేదిక వద్ద సమావేశమయ్యారు.
జనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి గారు ప్రెసిడెంట్ సతీష్ గారి ని, ట్రస్టీస్ ను, ఫౌండర్స్ ను మరియు గౌరవ అతిథి పద్మశ్రీ డా. పద్మజా రెడ్డి గారి ని స్టేజి మీద కి ఆహ్వానం పలుకుతూ ఐదు దశాబ్దాలుగా తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసిన అచ్చమైన వ్యక్తిత్వం కూచిపూడి డాక్టర్ పద్మజా రెడ్డి అని కాకతీయ రాజవంశం యొక్క వారసత్వాన్ని దాని వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు.
CATS ప్రెసిడెంట్ సతీష్ వడ్డి గారు మాట్లాడుతూ కళారంగానికి జీవితాన్ని త్యాగం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుందన్నారు. ఆమె తన 40 ఏళ్ల నృత్య ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు అని తెలిపారు. ట్రస్టీ సుధా రాణి గారు మాట్లాడుతూ సాధన చేయడం, అన్వేషించడం మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందడం ద్వారా లక్ష్యంగా చేసుకున్నారని, ఎంతో మంది విద్యార్థులకు ఆమె సేవ చేయడం నిజంగా తెలుగువారికి గర్వకారణం. వర్జీనియా DMV ఏరియా లో లోకల్ కూచిపూడి డాన్స్ స్కూల్ టీచర్స్ ఐన మల్లికా గారిని, సాయి కాంత గారిని, స్వాతి గారిని మరియు మంజు గారి ని వేదిక మీదకు ఆహ్వానించారు.
ప్రముఖ కూచిపూడి డాన్సర్ మల్లికా రాంప్రసాద్ గారు మాట్లాడుతూ పద్మజా గారి తో ఆమె జీవితం ఎలా సాగిందో విశదీకరించారు. మేము ఆమెను విద్యార్థి గా, ప్రదర్శకురాలిగా, ఉపాధ్యాయునిగా, సలహాదారుగా మరియు పరిశోధకురాలు గా చూసాము. ఆమె కాకతీయతను శుద్ధి చేసి పునర్ నిర్వచించారు అని కొనియాడారు. అటు పిమ్మట పద్మజా రెడ్డి గారు మరియు మల్లికా గారు కలిసి భామాకలాపం లో ఒక చిన్న నృత్య ప్రదర్శనాని ఇచ్చి ప్రేక్షకులకు కనువిందు చేసినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. CATS ఫౌండర్ రామ్ మోహన్ కొండ గారు మాట్లాడుతూ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనే మాటకు సరైన నిర్వచనం మన పద్మజా రెడ్డి గారు అని పేర్కొన్నారు.
పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కాకతీయ నృత్యానికి మూల కారణం ఏమిటో విశదీకరిస్తూ “కాకతీయం” అంటే గొందలి, రసకం, చరణ, పేరిణి శివతాండవం వాటి కలయిక గా పేర్కొన్నారు. CATS వారు నా స్నేహితులు మరియు విద్యార్థులతో కలిసి ప్రశ్నల రూపంలో నా జీవిత శైలి ని మరియు కాకతీయం పై నా ప్రేరణ అడిగి వారికి ఉన్న సందేహాలను తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆమె తన నృత్య ప్రదర్శనలలో భృణ హత్యలు (ఆడశిశువు) మరియు ఎయిడ్స్ మీద అవగాహన కలిగించే అంశాలను, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే నృత్యరూపకాలు ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం ను తీసుకొని రావడం తన లక్ష్యం గా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికీ CATS ట్రస్టీలు రామ్మోహన్ కొండ గారు, మధు కోలా గారు, భాస్కర బొమ్మారెడ్డి గారు, సలహాదారు గోపాల్ నున్న గారు, రమేష్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ టీమ్ లావణ్య తేలు, గీత, అవని, లక్ష్మీకాంత్, శరత్, సందీప్, సాయి, ESK,లతో పాటి లోకల్ లీడర్ శ్రీధర్ నాగిరెడ్డి గారు, మీడియా మిత్రులు వేణు నక్షత్రం గారు హాజరు అయ్యారు. చివరిగా క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ పెద్దలు అందరూ కలిసి పద్మజా రెడ్డి గారికి షాలువా వేసి స్మారక చిహ్నం (ప్లేక్) మరియు పుష్ప గుచ్యం అందించి సత్కరించారు. ప్రేక్షకులందరూ కరచర ధ్వనులతో ఆమెకు అభినందనలు తెలిపారు.