Connect with us

Cultural

సంస్కృతీ సంప్రదాయాలతోపాటు చక్కని ఎంటర్టైన్మెంట్‌ @ CATS Dussehra & Diwali, Washington DC Metro

Published

on

అమెరికాలో సంగీత, సాహిత్య, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఆధునికతను మేళవించి తెలుగువారిని రంజింపచేస్తున్న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) వారు నిర్వహించిన దసరా మరియు దీపావళి వేడుకలు ప్రవాసులను ఎంతగానో అలరించాయి. అక్టోబర్ 28వ తేదీన మేరీల్యాండ్ రాష్ట్రం Clarksburg నగరంలోని Clarksburg High School లో ప్రవాస భారతీయులను ఎంతగానో అలరించి అద్భుతమైన విజయాన్ని సాధించాయి.

ఈ వేడుకలకు వాషింగ్టన్ DC మెట్రో(DMV) ఏరియాలో నివసించే తెలుగు ప్రజలు దాదాపు 1500 మందికి పైగా విచ్చేయగా, 250 మంది కళాకారులతో నిర్విరామంగా 7 గంటల పాటు కొనసాగాయి. జ్యోతి ప్రజ్వలన మరియు గణేశా ప్రార్ధనతో ప్రారంభమైన కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఆసక్తికరంగా సాగాయి. స్థానిక నృత్య పాఠశాలలు ఈ పండుగల విశిష్టతను నృత్యరూపాలుగా ప్రదర్శించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి.

DMV స్థానిక కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య ప్రదర్శనలే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ సినీ మరియు జానపద నృత్యాలు ప్రేక్షకులకు ఎంతగానో ఆహ్లదాన్ని అందించాయి. అందులో ముఖ్యంగా Brighton Little Stars kids చేసిన రామాయణం స్కిట్, సంస్కృతి కళా అకాడమీ వారు చేసిన కృష్ణ లీల, కూచిపూడి డాన్స్ అకాడమీ జతిస్వరం, కూచిపూడి నృత్యాలయా వారి శాస్త్రీయ నృత్యాలు తెలుగు పండుగుల విశిష్ఠతను చాటిచెప్పగా, నవ్య ఆలపాటి వారి Starz Dance School చిన్నారులు చేసిన శ్రీదేవి tribute కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

హరిత మరియు ప్రత్యూష వారి గ్రూప్ ఫోక్ డాన్స్ లు వీక్షించిన ప్రేక్షకుల తన్మయత్వం చేకూర్చాయి. Starz Dance School వారు చేసిన Diwali Special Fashion Show లో ప్రదర్శించిన రంగు రంగుల అలంకరణతో దుస్తులు ధరించి చేసిన ఫ్యాషన్ షోను వీక్షించిన వాళ్ళ మనసులను దోచడమే కాకుండా, CATS కార్యవర్గం వారు ఆ Ramp Walk లో పాల్గొనడం విశేషం. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్పందన పల్లి గారు స్ఠానిక కళాకరులతో కలిసి చేసిన కూచిపూడి, భరతనాట్యం, కథక్ Fusion డాన్స్ మరియు టాలివుడ్ డాన్స్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల మనసులను దోచాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మేరీల్యాండ్ Lt. Governor Aruna Miller గారిని CATS బృందం అతిథి సత్కారాలతో ఆహ్వానించి, పుష్పగుచ్చం మరియు ప్రత్యేకంగా నేయించిన శాలువాతో సత్కరించారు. ఈ ఈవెంట్ లో అరుణ గారు మాట్లాడుతూ తనకు గత 15 సంవత్సరాలుగా CATS సంస్థతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ తెలుగు భాష మీద తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. అరుణ మిల్లర్ గారు తెలుగులో మాట్లాడుతూ, మనం ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని, ఇండియా లో ఉన్న ప్రజలకి సహాయార్ధం చేస్తున్న కృషిని కొనియాడుతూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న CATS కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

CATS సంస్థ స్పాన్సర్స్‌ ను శాలువా మరియు పుష్ప గుచ్చములతో ఘనంగా సత్కరించారు. ఈ దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా రుచికరమైన విందు భోజనమును Paradise Indian Cuisine Restaurant వారు అందించారు. ఈ వేడుకల కొరకు ఏర్పాటు చేసిన ఫోటో బూత్‌ అందరినీ ఆకర్షించడంతో విచ్చేసిన వారందరూ తమ తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతూ కనిపించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్ వడ్డీ అందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు
తెలుపుతూ CATS సంస్థ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమములో భాగంగా షెల్టర్ హోమ్స్ కోసం చేస్తున్న ఫుడ్ డ్రైవ్‌లు మరియు ఇండియా లో పేద విద్యార్థులకు చేస్తున్న చారిటీ సర్వీసెస్ ను అందించామన్నారు. చెస్ ఔత్సాహికులు ఉత్సాహభరితమైన పోటీలలో 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొనడమే కాకుండా ఈ కార్యక్రమంకు వ్యూహాత్మక ఉత్సాహాన్ని జోడించారు.

చెస్ టోర్నమెంట్ లో గెలిచిన చిన్నారులకు ట్రోఫీలు మరియు సర్టిఫికెట్స్ ను ATA President Elect జయంత్ చల్లా గారు, TDF మాజీ అధ్యక్షులు కవిత చల్లా గారు మరియు తేజ రాపర్ల గారు అందజేశారు. హాజరైన వారికి థ్రిల్లింగ్ రాఫెల్ బహుమతులు అందించడంలో ఈ వేడుకకు ఒక నిరీక్షణను జోడించారు Capitol Area Telugu Society (CATS) వారు.

ఈ కార్యక్రమాన్ని CATS అధ్యక్షులు సతీష్ వడ్డీ గారి అధ్యక్షతన, ఉపాధ్యక్షులు రామ ఎరుబండి గారు, జెనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి గారు, కోశాధికారి రమణ మద్దికుంట గారు, కల్చరల్ చైర్ విజయ దొండేటి, కల్చరల్ కో చైర్స్ లావణ్య, రంగ, మీనా, సుప్రజ, నవ్య, హరిత, ప్రత్యుష, పద్మ, జ్యోతి మరియు CATS కల్చరల్ అడ్వైసర్ గోపాల్ గారి సహాయంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులు బిక్షు నాయక్, పల్సర్ బైక్ రమణ, ఝాన్సీ, జబర్దస్త్ రమేష్, మౌనిక, లావణ్య, కీబోర్డ్ ఫ్రాన్సిస్, MS రాజు, మనోహర్ సింగ్, వాజిద్ హుస్సేన్ (తబలా) లు సంగీత విభావరితో హైవోల్టేజ్ ఎనర్జిటిక్, నాన్స్‌స్టాప్ పాటలు ఒకరికొకరు పోటాపోటీగా పాడిన ఉత్సాహవంతమైన పాటలు ప్రేక్షకులను 3 గంటల పాటు ఉర్రూతలూగించి నాట్యం చేసేలా చేసాయి.

CATS వారి దసరా మరియు దీపావళి వేడుకలు లైవ్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ ప్రేక్షకులకు ఎంతగానో ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని పంచాయంటే కొంతమంది వేదికపైకి వెళ్లి మరీ డాన్సులు వెయ్యడం చూస్తే అర్ధం అవుతుంది. ఇంతటి హైవోల్టేజ్ ఎనర్జీని అందించిన గాయనీ గాయకులకు కాట్స్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి CATS ట్రస్టీలు మరియు అడ్వైజర్స్ రామ్మోహన్ కొండ గారు, మధు కోలా గారు, భాస్కర్ బొమ్మారెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు, రవి బొజ్జ గారు, ఎగ్జిక్యూటివ్ టీమ్ కృష్ణ కిషోర్, మహేష్, పవన్ ధనిరెడ్డి, సాయి జితేంద్ర, రవి బారెడ్డి, లక్ష్మీకాంత్, తిప్ప రెడ్డి కోట్ల, ఉమాకాంత్, శ్రీనివాస్ కాసుల, ESK, విశాల్, మంజునాధ్ మిట్టపల్లి, శ్రీనివాస్ పూసపాటి, అమర్, కమలాకర్, ఫణి, రఘు, రామకృష్ణ, భార్గవ్, శివ పిట్టు, పింటూ, దినేష్, భానుక్రిష్ణ, భార్గవ్, ఉమాశంకర్, రవి తేజ, సందీప్ కాకా, సాయి నీలం, వివేక్, సందీప్, జయశ్రీ, అనుపమ, రజని గార్లతో పాటు లోకల్ లీడర్ శ్రీధర్ నాగిరెడ్డి గారు  హాజరు అయ్యారు. GTA ఫౌండర్ విషు కలవల గారు మరియు వారి DC చాప్టర్  కార్యవర్గ సభ్యులు అందరికి దసరా  శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతోపాటు చక్కని ఎంటర్టైన్మెంట్‌ని అందించిన CATS కార్యవర్గాన్ని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. చివరిగా ప్రేక్షకులకు, స్పాన్సర్లుకు, వాలంటీర్లకు, వేండొర్స్, ఫుడ్, రిజిస్ట్రేషన్, Decoration Committees మరియు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శకులకు CATS వైస్ ప్రెసిడెంట్ రామ ఎరుబండి గారు ధన్యవాదాలు తెలుపుతూ జాతీయ గీతాలాపన తో ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected