రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) వారు శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను మార్చ్ 25 శనివారం రోజు వర్జీనియా లోని అష్బుర్న్ నగరం బ్రియార్ వుడ్స్ హై స్కూల్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రెండు వేలకు పైగా తెలుగువారు హాజరయ్యారు.
420 మందికి పైగా కళాకారులతో 8 గంటల పాటు నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా టాలీవుడ్ గాయకులు అనుదీప్ మరియు సమీరా భరద్వాజ్ గారు తన గానామృతం తో అందరిని మంత్రముగ్ధులను చేసారు. అలాగే యాంకర్స్ శ్రావ్య మానస మరియి స్వర్ణ దేవి గారు తమ టాలెంట్ తో ప్రేక్షకులని అలరింప చేసారు.
జ్యోతి ప్రజ్వలన మరియు గణేశా ప్రార్ధనతో ప్రారంభించి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆకట్టుకున్నాయి. తెలుగు ఆధారిత సాంప్రదాయ వస్త్రాలంకరణ (ఫ్యాషన్ షో), టాలీవుడ్ & బాలీవుడ్ డాన్స్ లు మరియు వేదిక అలంకరణ, ఆడియో విజువల్స్ మొదలైన ఎన్నో కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ కార్యక్రమాన్ని కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ గారి అధ్యక్షన, ఉపాధ్యక్షులు రామ ఎరుబండి గారు, జెనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి గారు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్ కౌశిక్ సామ గారు ప్రారంభించగా, కల్చరల్ చైర్ విజయ దొండేటి గారు కల్చరల్ కో చైర్స్ హరిత, సత్య, నవ్య, రంగ, లావణ్య, మీనా, జయశ్రీ, సుప్రజ, గీత, జ్యోతి, ప్రత్యుష గార్లతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
కోశాధికారి రమణ గారు, రవి గణపురం గారు, అరుణ గారు మరియు విష్ణు గారి పర్యవేక్షణలో నిర్వహించిన చెస్ పోటీలకు 50 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అందులో గెలుపొందిన చిన్నారులందరికీ కాట్స్ ట్రోఫీలు, మెడల్స్ ను విచ్చేసిన అతిధిలు లౌడాన్ కౌంటీ అండ్ ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీ ఆఫీషియల్స్ వారి చేత అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగ 30 వెండర్ స్టాల్ల్స్ రావడం విశేషం. అలాగే ఫుడ్ స్టేషన్స్ దగ్గర అన్ని వసతులు చక్కగా చూసుకున్న ఫుడ్ కమిటి వాళ్లకు మరియు ఉమాకాంత్ రఘుపతి గారికి Capitol Area Telugu Society (CATS) కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసింది.
ఈ కార్యక్రమాలన్ని ట్రస్టీ రామ్ మోహన్ కొండ గారు, మధు కోలా గారు, భాస్కర్ గారు, అనిల్ గారు, సుధారాణి గారు మరియు అడ్వైజర్స్ రవి బొజ్జ గారు, ప్రవీణ్ కాటంగూరి గారు, గోపాల్ నున్న గారు, వెంకట్ కొండపోలు గారు, రమేష్ రెడ్డి గారు, శ్రీలేఖ గారు రీజినల్ ఉపాధ్యక్షులు హరీష్ కొండమడుగు, రవి గణపురం మరియు కాట్స్ ఎగ్జిక్యూటివ్ టీమ్ కృష్ణ కిషోర్, అమర్ పాశ్య, రఘు జువ్వాడి, సాయి జితేంద్ర, మహేష్ అనంతోజ్, పద్మ, అనుపమ, అవని, రజని, లక్ష్మీకాంత్, పవన్ ధనిరెడ్డి, వికాస్ ఉలి, శరత్, ESK శ్రీనివాస్, హేమంత్, సేతన్(పింటూ), జగదీష్, వికాస్, శివ మర్రెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, గిరి బండి, అమర్ అతికం, నివాస్, పవన్ పెండ్యాల, శ్రీకాంత్ చల్ల, శ్రీని గడీల, శ్రీనివాస్ పూసపాటి, శుభాష్ మరియు చాల మంది స్కూల్ వాలంటీర్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో విజయవంతంగా సాగాయి.
ఈ వేడుకలకి హాజరైన ప్రాంతీయ మరియు జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు అందరికి CATS కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకి, మీడియా మిత్రులు శ్రీనివాస్ ఉయ్యురు గారు (NRI Streams), ఈశ్వర్ బండ గారు(TV9), వేణు నక్షత్రం గారు(Pilupu TV), శాంతను (DJ), ఉమా కర్నాటి గారు (ఫోటోగ్రాఫర్), అలాగే పసందైన ఉగాది ట్రేడిషనల్ భోజనం అందించిన Country Oven Restaurant వారికి, వేదికను అందంగ అల్లంకరించిన శుభం ఈవెంట్ డేకర్స్ కు CATS కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసింది.