రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) వారు సెప్టెంబర్ 3 న ఎలి కాట్ సిటీ, మేరీల్యాండ్ లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించిన వనభోజనాలకి మేరీల్యాండ్, వర్జీనియా మరియు వాషింగ్టన్ డిసి లో నివసిస్తున్న తెలుగు వారందరు పెద్ద ఎత్తున విచ్చేసి జయప్రదం చేశారు. ఎన్నో రకాల రుచికరమైన వంటకాలతో, మ్యూజిక్ తో, చిన్నారుల ఆట పాటలతో, పెద్దవాళ్ళ ముచ్చట్లతో, భారత దేశం నుండి విచ్చేసిన అమ్మమ్మ, నానమ్మ, తాతలతో, ఎప్పుడు ఆఫీస్ పని తో బిజీగా ఉండే మిత్రుల కు ఈ వనభోజనాలు ఎన్నో మధుర స్మృతులు మిగిల్చాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఈ సంవత్సరం చేసిన వనభోజనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎన్నో రుచికరమైన వంటకాలు, భారత దేశంలో పెళ్లి వంటకాల మాదిరిగా పెద్ద పెద్ద బగొనాలలో వండి, వేడి వేడిగా వడ్డిస్తుంటే వందలమంది ప్లేట్లు పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ తినడమే కాకుండా, అంతమంది కష్టపడి వండి నందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
రాఫెల్స్ తీసి గెలిచిన విజేతలకు ఆపిల్ ఎయిర్ పాడ్, సైకిల్ తో పాటు మరెన్నో బహుమతులను అందజేశారు. వాలీ బాల్, త్రోబాల్, బింగో వంటి సరదా ఆటలను నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మెహందీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన మాంత్రికుడు, ఆహ్లాదకరమైన దుస్తులలో ప్రదర్శన ఇస్తూ, సంగీతాన్ని ప్లే చేస్తూ, లింబో, పారాచూట్, డ్యాన్స్, గారడీ క్యాచ్ & త్రో, ఫన్ స్టిక్స్, రింగ్స్ మరియు హులా హూప్స్ తో గారడీని ప్రదర్శించాడు.
క్యాట్స్ (Capitol Area Telugu Society) అధ్యక్షులు సతీష్ వడ్డి గారు మాట్లాడుతూ.. ఈ వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తోడ్పాటు అందించిన తోటి కార్యవర్గ సభ్యులందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేశారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించిన కాట్స్ కార్యవర్గానికి, ధర్మకర్తలకు మరియు సలహాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ట్రస్టీస్ & అడ్విసోర్స్ రామ్మోహన్ కొండా గారు, భాస్కర్ గారికి, మధు గారికి, అనిల్ గారికి, రవి గారికి, ప్రవీణ్ గారికి, గోపాల్ గారికి, రాజి రెడ్డి గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే మా ఈ ఈవెంట్ కోసం మాతో పాటుగా కృషి చేసిన మా కాట్స్ కార్యవర్గం, కోట్ల, పవన్, రవి బారెడ్డి, సాయి జితేంద్ర, కృష్ణ కిశోర్, నివాస్, బాబీ, మంజునాథ్, లక్ష్మీకాంత్, హరీష్, శ్రీనివాస్, రాంపురం గౌడ్, రజని, అరుణ, లావణ్య, సంకీర్త, నవ్య, అనుపమ, అవని, ఉమాపతి, రాజు గొనె, ప్రతాప్, సతీష్ గజం, శరత్, ఈఎస్కే, విశాల్, రామ్, శ్రీని సాయిని, రాజ్ యరమల,వెంకట్ యర్రం. లక్ష్మి నారాయణ మరియు తదితరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
CATS ప్రధాన కార్యదర్శి పార్థ బైరెడ్డి గారు మాట్లాడుతూ.. ఈ పిక్నిక్ ఈవెంట్ లో చాలా మంది కొత్త వ్యక్తులను కలుసుకున్నాము. ఇలా అందరినీ ఒకే దగ్గర కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మన ఏరియా లో తెలుగు వాళ్లకు కాట్స్ ఎప్పుడు అండదండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా కాట్స్ లో భాగస్వాములుగా చేరి మా కార్యక్రమాల్లోపాలు పంచుకోవాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున సాగిన ఈ కాట్స్ పిక్నిక్ కు సహాయ సహకారాలు అందించిన కాట్స్ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు.
క్యాట్స్ (CATS) కోశాది కారి రమణ మద్దికుంట గారు మాట్లాడుతూ.. స్పాన్సర్స్ అందరికీ మరియు మా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యదర్శి కృష్ణ కిషోర్ గారు మాట్లాడుతూ విద్యార్థి వాలంటీర్లు కు స్వచ్ఛంద పని గంటలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కాట్స్ ప్రెసిడెంట్ సతీష్ వడ్డీ గారు భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇదే తీరుగా సహకారం ఇవ్వాలని కోరుతూ, తమ ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రవాస తెలుగు వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అక్టోబర్ 28న జరుగబోయే దసరా దీపావళి కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు.