Capitol Area Telugu Society ‘CATS’ (రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం) Washington DC మెట్రో ప్రాంతం లో గైథర్స్‌బర్గ్ హై స్కూల్‌లో దసరా మరియు దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సంబరాలకి స్తానిక కళాకారులైన పిల్లలు, పెద్దలు 250 మందికి పైగా పాల్గొని వారి ప్రదర్శనలతో విశేషంగా తరలి వచ్చిన ఆహుతులను ఆకట్టుకున్నారు.
జ్యోతి ప్రజ్వలన మరియు గణేశా ప్రార్ధనతో ప్రారంభించిన ఈ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, భారత దేశ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ గాయని గాయకులు లిప్సిక, రోల్ రీడ & రఘురాం వాళ్ళ గానామృతంతో మరియు వాక్చాతుర్యంతో ప్రేక్షకులలో నూతన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలుగజేశారు.
ఈ వేడుకలలో ముఖ్యంగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన రీటా డాన్స్ అకాడమీ వారి దశావతారాల నృత్య ప్రదర్శన, ఫ్రీస్టైల్ డాన్స్ స్కూల్ వారి దేశభక్తి గీతం తో చిన్నారులు చేసిన డాన్సులు, స్టార్స్ స్టూడియో వారి తెలుగు ఆధారిత సాంప్రదాయ వస్త్రాలంకరణ, బాల దత్త వారి చిన్నారులు పాడిన భాగవత గీత శ్లోకాలు, శాస్త్రీయ నృత్యాలు, దేశీ టాలెంట్ వారి సంగీత విభావరి ఇంకా మరెన్నో టాలీవుడ్ మరియు బాలీవుడ్ డాన్స్ లు DJ తో కలుపుకొని కార్యక్రమ సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ కార్యక్రమం లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బ్రైడల్ ఫ్యాషన్ షో. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంప్రదాయలకు అనుగుణముగా పెళ్లి కూతురులా ముస్తాబు తో చేసిన ఈ బ్రైడల్ ఫ్యాషన్ షో వీక్షించిన జనానికి ఎంతగానో కనువిందు చేసింది.
ఈ కార్యక్రమాన్ని కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ గారి అధ్యక్షతన, ఉపాధ్యక్షులు రామ యరుబండి గారు, జనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి గారు, కల్చరల్ చైర్ విజయ దొందేటి గారు, కోశాధికారి రమణ మద్దికుంట గారు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్ కౌశిక్ సామ గారు ప్రారంభించగా కల్చరల్ కో చైర్స్ లావణ్య, హరిత, జయశ్రీ, నవ్య,మీనా,ప్రత్యూష, జ్యోతి, పద్మ, సత్య గార్లతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
CATS నిర్వహించిన Chess మరియు Math Talent పోటీలకు 100 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము మధు కోలా గారు, సందీప్ గారు, తేజ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ గా సాయి అరిగేలా, అరుణ, సంకీర్త తో నిర్వహించి అందులో గెలుపొందిన చిన్నారులందరికీ కాట్స్ ట్రోఫీలు, మెడల్స్ మరియు ప్రైజ్ మనీ ని విచ్చేసిన అతిధిలతో అందజేశారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మయూర్ మోడీ గారు అమెరికన్ డైవర్సిటీ గ్రూప్ ద్వారా ఆయన చేసిన సేవలను గుర్తించి కాట్స్ వారు వారిని ఘనంగా సత్కరించారు. టీడీఫ్ నుంచి విశ్వేశ్వర కలవల గారు, లోకల్ లీడర్ శ్రీధర్ నాగిరెడ్డి గారు, మీడియా మిత్రులు ఈశ్వర్ బండ గారు, వేణు నక్షత్రం గారు హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమాలన్ని ట్రస్టీ రామ్ మోహన్ కొండ గారు, మధు కోలా గారు, భాస్కర్ గారు, అనిల్ రెడ్డి గారు మరియు అడ్వైజర్స్ రవి బొజ్జ గారు, ప్రవీణ్ కాటంగూరి గారు, గోపాల్ నున్న గారు, రమేష్ రెడ్డి గారు రీజినల్ ఉపాధ్యక్షులు హరీష్ కొండమడుగు, రవి గణపురం మరియు కాట్స్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అవని, రజని, అనుపమ, కృష్ణ కిషోర్, రంగ, లక్ష్మీకాంత్, శివ పిట్టు, పవన్ ధనిరెడ్డి, మహేష్ అనంతోజు, సాయి జితేంద్ర, కోట్ల తిప్పారెడ్డి, వికాస్ ఉలి, శరత్, సందీప్, దయానంద్, రఘు, గిరి బండి ఆధ్వర్యంలో విజయవంతంగా సాగాయి.
ఈ కార్యక్రమానికి సహాయం చేసిన స్పాన్సర్లు, డెకరేటర్స్, మీడియా మిత్రులు, పార్టిసిపెంట్స్, వేండొర్స్, కేటరింగ్, అతిధులు మరియు ఆడియన్స్‌కి కాట్స్ కార్యవర్గ సభ్యుడు రంగ గారు ధన్యవాదాలు తెలుపుతూ జాతీయ గీతాలాపన తో ముగించారు.