Connect with us

Food

CATS, Washington DC: రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వంటల పోటీలు

Published

on

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సి మెట్రో ప్రాంతం నందు వంటల పోటీలు (Cooking Competitions) ఘనంగా నిర్వహించారు. ఈ వంటల పోటీలకు అధ్బుతమైన స్పందన వచ్చింది. ఇందులో ఉభయ రాష్ట్రాల నుండి 65 మంది మహిళలు పాల్గొన్నారు.

ఈ వంటల పోటీలలో సాంప్రదాయ వంటలతో రుచికరంగా చెయడమే కాకుండా ఎంతో అధ్భుతంగా మరియు వినూత్నంగా అలంకరణ చేయడం విశేషం. అన్ని మంచి రుచికరమైన వంటలలో ఏ వంటను ఎన్నిక చెయడం ఆరుగురు జడ్జీలకు (Judges) చాలా కష్టంగా అనిపించింది.

CATS వారి ఆధ్వర్యంలో ఈ వంటల పోటీలకు అవార్దు ప్రధానోత్స్వం చెయడానికి జడ్జీలుగా విచ్చేసిన వారు శిరీష జువ్వాడి, ఈశ్వరి లంకిశెట్టి, సిరి కొంపల్లి, శ్వెతా రఘు, స్వప్న చిన్నక్కగారి, అనురాధ కోట్ల వారి చెతులమీదుగా గెలుపొందిన పోటీదారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందచేశారు.

ఈ అవార్డు ప్రధానోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది. ఈ వంటల పోటీల్లో ముఖ్యంగా ఆరుగురు చిన్నారులు పాల్గొనడం విశేషమైతే వారు చేసిన రుచికరమైన వంటలకు అవార్డులు కూడా బహూకరించారు. ఈ సారి “Most Valuable Chef” (MVC) అనే అవార్డును అక్కడికి విచ్చేసిన ప్రేక్షకులు ఎన్నుకోవడం మరింత ఆకర్షణీయం.

CATS అధ్యక్షులు సతీష్ వడ్డి (Sathish Vaddi) మాట్లాడుతూ (District of Columbia, Maryland, Virginia) DMV ఏరియాలో CATS వారే మొట్టమొదటి సారిగా ఈ వంటల పోటీ ప్రారంభించారు అని, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎక్సిక్యూటివ్ టీంకు, జడ్జీలకు, స్పాన్సర్లకు, పోటీలో గెలిచిన వారికి మరియు పాల్గొన్న అందరకి ధన్యవాదములు తెలిపారు. ఇలాగే ముందు ముందు CATS వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని, అందరు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

ఈ విజయవంతమైన కార్యక్రమానికి కృషి చేసిన ఎక్సిక్యూటివ్ టీం పార్ధ బైరెడ్డి (Partha Byreddy), రమణ మద్దికుంట, విజయ దొండేటి, రంగా సుర, రవి ఘనపురం, హరీష్ కొండమడుగు, సాయి జితేంద్ర, సత్య మల్ల, మహేష్ అనంతోజ్, వికాస్, నవ్య ఆలపాటి, పద్మ కార్లపాటి, అరుణ బసాటి, మీనా కలికోట, అవని తాటిపాముల, ఫౌండర్ రామ్ మోహన్ కొండా, ట్రస్టీలు-సహాయదారులు –  మధు కోలా, భాస్కర్ బొమ్మారెడ్డి, గోపాల్ నున్న మరియు CATS టీం అందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected