Connect with us

Health

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో Cancer Awareness Session

Published

on

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ (Cancer Awareness Session) ను ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 25వ తేదిన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నైటా సంస్థ కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు అడ్వైజర్స్ అందరూ హాజరయ్యారు.

న్యూయార్క్ (New York) లో ఉన్న తెలుగు కమ్యూనిటీకి క్యాన్సర్ మీద అవగహన కలిపించటం కోసం ఒక చిన్ని ప్రయత్నంగా ఇక్కడ న్యూ యార్క్ పట్టణంలో పేరు ప్రాఖ్యాతలు గాంచిన డా. సునీల్ మెహెరా ఈ కార్యక్రమనికి ప్రతేక వాఖ్యాతగ వచ్చి, క్యాన్సర్ మీద అవగహన కల్పించడం జరిగినది.

డా. మెహెరా గారు క్యాన్సర్ (Cancer) యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క విస్తరణ, తీసుకోవాలిసిన జాగ్రత్తలు, రకరకాల క్యాన్సర్ కండిషన్స్, వాటి యొక్క చికత్స విధానం, జీవనశైలి, నియంత్రణ మొదలగు వాటి పై చాలా చక్కగా అందరికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది.

అదేవిధంగా తన యొక్క ప్రత్యక్ష, స్వీయ అనుభవాలని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేక్షకులనుంచి వచ్చిన ప్రశ్నలని నైటా (NYTTA) కార్యవర్గం వాణి సింగిరికొండ, రవీందర్ కోడెల, పవన్ రవ్వ, సునీల్ గడ్డం, రమ వనమా, హేమ వెంకట, షాలిని మేఖల అడిగిన ప్రశ్నలకి ఓపికతో సమాధానం చెప్పడం జరిగింది.

నైటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ (NYTTA BOD) డా. కృష్ణ భాదే గారు ఈ కార్యక్రమానికి ఆధ్యంతం వాఖ్యాతగా వ్యవహరించి, తన యొక్క స్వీయ అనుభవాల్ని, క్యాన్సర్ (Cancer) కు తీసుకోవలిసిన జాగ్రత్తలని మరియు తను కమ్యూనిటీకి చేస్తున్న సేవలని వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ మాట్లాడుతూ.. డా. సునీల్ మెహెరా అండ్ కృష్ణ భాదే గారులు అడగగానే మా కార్యక్రమానికి వచ్చి నైటా ప్రేక్షకులకు క్యాన్సర్ మీద అవగాహన కలిపించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ సందర్భంగా నైటా ప్రేకక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నైటా కార్యవర్గాన్ని అందరూ అభినందిచడం జరిగింది. చివరగా సౌమ్య శ్రీ గారు ఓట్ ఆఫ్ థాంక్స్ వ్యక్త పరుస్తూ.. కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు, డా. సునీల్ మెహెరా గారికి, కృష్ణ భాదే గారికి, సంస్థ శ్రేయోభిలాషి, డోనార్ డా. పైళ్ల మల్లా రెడ్డి గారికి, నై టా కార్యవర్గానికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సలహాదారులకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

తదుపరి వాణి సింగిరికొండ (Vani Singirikonda) నైటా జరుపబోయే కార్యక్రమాలని వివరిచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతక్ష ప్రసారం చేసిన మన టీవీ (Mana TV) ప్రతినిధులు శరత్ మరియు రాగిణి గారులకు నైటా (New York Telangana Telugu Association) కార్యవర్గం కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected