కెనడా (Canada) లోని ప్రముఖ తెలుగు ఎన్నారై లక్ష్మీనారాయణ సూరపనేని కి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా 24వ మహాసభల్లో ప్రవాస తెలుగువారి సమక్షంలో 68 సంవత్సరాల వయసులో లక్ష్మీనారాయణ సూరపనేని (Lakshminarayana Surapaneni) కి ఈ గౌరవం (Award) దక్కింది.
కెనడా (Canada) నుంచి తానా కార్యవర్గంలో అత్యధిక కాలం సేవలందించినందుకు గాను అప్ప్రీసియేషన్ అవార్డు అందుకున్నారు. రిటైర్డ్ IPS AB వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సొంగా రోషన్ , తంగిరాల సౌమ్య, Dr. చదలవాడ అరవింద బాబు, TV5 మూర్తి, కోమటి జయరాం మరియు తానా నాయకులు డెట్రాయిట్ (Detroit, Michigan) లోని తానా వేదికపై ఈ అవార్డు అందజేశారు.
లక్ష్మీనారాయణ సూరపనేని, భార్య ఇద్దరు పిల్లలతో కెనడా లోని టోరంటో (Toronto) నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిచెనర్ (Kitchener) పట్టణంలో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, కృష్ణా జిల్లా, దివి తాలూకా, పెదశనగల్లు గ్రామం లక్ష్మీనారాయణ స్వస్థలం.
14 సంవత్సరాలపాటు ఇండియాలో చేసిన ఉద్యోగం వదిలేసి 1990 లో కెనడాకి వచ్చారు. కిచెనర్ (Kitchener, Ontario) లోని కొనెస్టోగా కాలేజీలో (Conestoga College) డిగ్రీ పూర్తి చేశారు. అలాగే 2003 లో ఎంబీఏ చదివారు. స్థానిక ఇంజనీరింగ్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.